Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తిరుగుబాటు నేతలపై శివసేన శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల ఆస్తులపై శివసైనికులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే అయిదురు రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేశారు శివసైనికులు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ సెక్యురిటీ కల్పించింది. నలుగురైదుగురు సీఆర్ పిఎఫ్ జవాన్లు, షిప్టుల వారిగా ప్రతి ఎమ్మెల్యేకు భద్రతా ఉంటారని కేంద్రం ఆదివారం తెలిపింది. కేంద్రం భద్రత కల్పించిన వారిలో రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్, సంజయ్ శిర్సత్, లతాభాయ్ సోనావానే, ప్రకాశ్ సుర్వే సహా మరో పది మంది పది మంది ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పిస్తామని అధికారులు తెలిపారు.

ఈ రోజు శివసేన కార్యకర్తలు భారీ ర్యాలీగా ముంబాయిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయి వస్తే తమ తఢాకా చూపిస్తామని శివసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల పదవ తేదీ వరకూ 144 సెక్షన్ అమలో ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయికి రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి మరి కొన్నాళ్లు గువాహటిలోనే ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తొంది. ఈ విషయాన్ని తిరుగుబాటు వర్గ నేత ఒకరు వెల్లడించడం గమనార్హం. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిందే నేతృత్వంలో రెబల్ ఎమ్మెల్యేలు గువాహటిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్న సంగతి తెలిసిందే. శివసేన అసమ్మతి వర్గం తమ గ్రూపునకు శివసేన (బాలా సాహెబ్) గా ప్రకటించుకోవడంపై ఉద్దవ్ ఠాక్రే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శివసేన, దాని వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పేరు ను ఉపయోగించుకునే హక్కు ఇతరులకు ఎవరికీ లేదని తెలిపింది.
ముంబాయిలో శనివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గం ఆరు తీర్మానాలు చేసింది. రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఉద్దవ్ కు అధికారమిచ్చింది. ఇదే క్రమంలో శిందే వర్గంలో ఉన్న 8 మంది మంత్రులపై వేటు వేయడానికి ఉద్దవ్ చర్యలు ప్రారంభించారు. మరో పక్క ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే రంగంలోకి రంగంలోకి దిగారు. ఆమె రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వాళ్ల భార్యలతో మాట్లాడుతున్నారు. వారి భర్తలకు నచ్చజెప్పి గువాహటి నుండి వచ్చేయాలని చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నారుట. తన భర్త నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు రష్మీ ఠాక్రే.