Maharashtra Political Crisis: ‘మహా’ రాజకీయంలో కీలక పరిణామాలు

Share

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకూ తెరవెనుక ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర బీజేపీ పెద్దలతో చర్చించిన అనంతరం నిన్న రాత్రి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో భేటీ అయ్యారు. ఆ తరువాత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బలపరీక్ష నిరూపణకు గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి మెజార్టీ నిరూపించుకోవాలని సీఎం ఉద్దవ్ ఠాక్రేను గవర్నర్ కోష్యారీ ఆదేశించారు. ఈ మేరకు లేఖ రాశారు. రేపు (గురువారం) 5 గంటల లోపు బలపరీక్షకు డెడ్ లైన్ విధించారు గవర్నర్. బలపరీక్షను రికార్డు చేయాలని ఆదేశించారు. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో ఏక్ నాథ్ శిందే వర్గం ఎమ్మెల్యేలు గురువారం ఉదయానికి గోహతి నుండి ముంబాయికి చేరుకోనున్నారు.

Maharashtra Political Crisis Governor bhagat Singh Key Orders

Maharashtra Political Crisis: రేపు ముంబాయికి చేరుకుంటాం

గురువారం ఉదయానికి తమ మద్దతు ఎమ్మెల్యేలతో ముంబాయికి చేరుకుంటామని ప్రకటించారు ఏక్ నాథ్ శిందే. వారం రోజుల తర్వాత శిందే వర్గంలోని ఎమ్మెల్యేలు గోహాతిలోని ఫైవ్ స్టార్ హోటల్ నుండి బయటకు వచ్చారు. ఏక్ నాథ్ శిందే తో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు గోహతిలోని కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శిందే మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలు సంతోషం కోసం ప్రార్ధించామని చెప్పారు. రేపు అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో పాల్గొంటామని తెలిపారు. బలపరీత్ర తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

Maharashtra Political Crisis: గవర్నర్ ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన శివసేన

మరో పక్క బలపరీక్ష కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను శివసేన సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీం కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేశారు. బలపరీక్ష జరగకుండా మథ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని శివసేన పిటిషన్ లో కోరింది. శివసేన తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, శిందే తరపున నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించనున్నారు. సుప్రీం కోర్టులో కేసు ఉండగా బలపరీక్ష ఎలా నిర్వహిస్తారని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నిస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ బలాబలాలు

శివసేన 16, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44, ఇతరులు 12, బీజేపీ కూటమి 113, శిండే వర్గం 49గా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ సంఖ్య 144.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

37 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

46 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago