NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Presidential Election: బీజేపీకి వైసీపీ మిత్ర పక్షమే(నా)…? జగన్ కు అందని దీదీ అహ్వానం..!!

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ పక్క టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మరో పక్క ఎన్సీపీ నేత శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో భేటీ అయ్యేందుకు ఢిల్లీ పయనమవుతున్నారు. కాంగ్రెస్ నుండి విపక్షాల నేతలకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం మంతనాలు సాగుతున్నాయి. ఈ విషయాలు ఇలా ఉంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ) ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో విపక్ష పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని 22 పార్టీల నేతలకు ఆమె లేఖలు రాశారు. తెలంగాణ సీఎం కేసిఆర్ కు ప్రత్యేకంగా దీదీ ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించినట్లు వార్తలు వినబడుతున్నాయి.

Mamata Banerjee meeting opposition leaders delhi Presidential Election
Mamata Banerjee meeting opposition leaders delhi Presidential Election

 

ఎన్ డీ ఏ అభ్యర్ధి ఓడించడమే లక్ష్యంగా దీదీ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ లో 15వ తేదీ జరిగే సమావేశానికి హజరు కావాలని వివిధ రాజకీయ పక్షాల నేతలను దీదీ ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికను పురస్కరించుకుని భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేసేందుకు ఈ సమావేశానికి హజరుకావాలని మమత ఆయా పార్టీల నేతలకు పిలుపు నిచ్చారు. బలమైన అభ్యర్ధిని బరిలో నిలపాలనే లక్ష్యంతోనే విపక్ష నేతలు, ముఖ్యమంత్రులతో దీదీ సమవేశమవుతున్నారంటూ టీఎంసీ నేతలు స్పష్టం చేశారు. అయితే మమతా బెనర్జీ .. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసిఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలను ఆహ్వానించారు.

కానీ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆహ్వానం పంపలేదని తెలుస్తొంది. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును దీదీ ఆహ్వానించలేదు. కేంద్రంలోని బీజేపీతో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సన్నిహితంగా వ్యవహరిస్తున్నందునే దీదీ ఆహ్వానం పంపలేదని భావిస్తున్నారు. టీడీపీకి అసెంబ్లీ, పార్లమెంట్ లో తక్కువ బలం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రోరల్ కాలేజీ లో టీడీపీ సంఖ్యాలం చాలా తక్కువగా ఉండటంతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏమీ మాట్లాడకుండా మూడేళ్లుగా సైలెంట్ గా ఉంటున్న నేపథ్యంలో ఆయనను పరిగణలోకి దీదీ తీసుకోలేదని భావిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. జూలై 18న ఎన్నిక జరగనుంది. 21వ తేదీన కౌంటింగ్ జరగనుంది. దీదీ సమావేశానికి ఆహ్వాానం అందుకున్న నేతల్లో ఎవరెవరు హజరు అవుతారు అనేది ఆసక్తికరంగా మారుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju