NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

West Bengal : బీజేపీ వ్యూహంలో మమత అభిమన్యుడు అవుతారా?

West Bengal : బీజేపీ వ్యూహంలో మమత అభిమన్యుడు అవుతారా?

West Bengal : భారతీయ జనతా పార్టీ తన ప్రత్యేకమైన ఎజెండాతో నే ఏ రాష్ట్రంలో నైనా రాజకీయాలు మొదలు పెడుతుంది. ఒక నిర్దేశిత విధానంలో వెనక ఉన్న బలమైన హిందుత్వ సిద్ధాంతాలతో అవకాశం కోసం వేచి చూసి చిన్న సందు దొరికినా ఆ రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపి ఎత్తుగడలు వేయడంలో బిజెపి నాయకత్వం ఆరితేరి ఉంటుంది. ఒకప్పుడు పశ్చిమబెంగాల్ West Bengal  రాష్ట్రంలో కనీసం వినిపించని బిజెపి పేరు ఇప్పుడు ప్రధాన పక్షంలో కి రావడానికి సైతం బిజెపి వేసిన ఎత్తుగడలు ఫలించడం మే. త్వరలో జరగబోయే పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కచ్చితంగా ఈ సారి ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించాలని బలంగా అనుకుంటున్న కమలనాథులు వేసిన కొన్ని ఎత్తుల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పడినట్లు కనిపిస్తున్నారు. బిజెపి పన్నిన వ్యూహాన ఆమె ఎలా చేస్తారు బయటకు వచ్చి అభిమన్యుడిలా బిజెపి కు ఎలాంటి దీటైన సమాధానం చెబుతారు అన్నది ఆసక్తిగా మారింది.

West Bengal : mamatha goes into bjp trap
West Bengal : mamatha goes into bjp trap

వాడి వేడిగా…

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత వేడిని ఈసారి పుట్టిస్తున్నాయి. పూర్తిగా బిజెపి, తృణముల్ కాంగ్రెస్ ఎన్నికల గానే ఇవి కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడా వామపక్షాల అలకిడి సైతం వినిపించడం లేదు. 294 సీట్లలోనూ బిజెపి తృణముల్ కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది వాతావరణం. పశ్చిమ బెంగాల్ మొత్తంగా బిజెపి తృణముల్ కార్యకర్తలే బాహాబాహీకీ దిగుతున్నారు. పూర్తిగా విస్తరించిన బీజేపీ శ్రేణులకు ఇటీవల తృణమూల్ నుంచి బీజేపీ లోకి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు నాయకులు సైతం మద్దతు పలుకుతూ గ్రామాల్లో సైతం రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు.

జై శ్రీరామ్ వద్దే వద్దు !

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు జైశ్రీరామ్ నినాదం పెద్ద అంశంగా మారుతోంది. అధికార పీఠాన్ని ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉన్న బిజెపి జై శ్రీరామ్ నినాదంతో మమతను కలవరపెడుతోంది. దీనికి తగ్గట్టుగానే మమత సైతం ఆ నినాదం వినగానే ఎక్కడలేని కోపాన్ని బహిరంగంగా ప్రదర్శించడంతో ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు మమతాబెనర్జీ కోపం తెప్పించాలి అంటే ఒక ఆయుధంగా ఈ నినాదం అందరికీ ఉపయోగ పడుతోంది. మమత ప్రసంగిస్తున్న బహిరంగ సభలోనూ ఆమె కాన్వాయ్ వెళుతుండగా దారిలో నేను సైతం ఈ నినాదం మార్మోగుతుంది. బీజేపీ ఈ నినాదాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లడంలో ఓ వ్యూహం ప్రకారం పని చేసింది. దీనికి తోడు ఈ నినాదం వెంట వెంటనే బిజెపి మీద కోపాన్ని అధికార పార్టీ చూపించడం నిరసనకారులు మరింత రెచ్చగొట్టి నట్లు అవుతుంది.

ఎందుకు ఆమె ఆగ్రహం…

మమత ఈ మధ్యకాలంలో బహిరంగంగానే కోపాన్ని ప్రదర్శించటం ఆ పార్టీ కార్యకర్తలు సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో దీదీ తీరు గతానికి విరుద్ధంగా కనిపిస్తుంది. ఆమె జైశ్రీరామ్ నినాదం వినగానే వెంటనే కోపాన్ని ప్రదర్శిస్తున్నారు లేదా సభల నుంచి అర్ధాంతరంగా వెనుదిరుగుతున్నారు. జనవరి 23 న సుభాష్ జయంతి కావడం తో కలకత్తాలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. దీంతో ఆయనకు స్వాగతం చెప్పేందుకు ముఖ్యమంత్రి హోదాలో మమతాబెనర్జీ వచ్చి సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా జైశ్రీరామ్ నినాదాలు రావడం తో ఆమె తీవ్ర కోపోద్రిక్తురలై వేదిక దిగి వెళ్లిపోయారు.

ఇక్కడ నుంచే చిక్కులు…

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలు ఎక్కడ కనిపించినా జై శ్రీరామ్ నినాదాలు చేయడం పరిపాటి . అయితే ఇది అసెంబ్లీ ఎన్నికలు నినాదంగా మారడం లో మాత్రం ఇది స్వయంకృతాపరాధం కనిపిస్తుంది . జనవరి చివర్లో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడుతూ జైశ్రీరామ్ నినాదాన్ని పశ్చిమబెంగాల్లో నిషేధించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సమాయత్తమయ్యారు. ఈ నినాదం చేసే వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని సైతం ఆమె భావించారు. దీంతో శాసన సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఇటు బిజెపి శాసన సభ్యులే కాకుండా కాంగ్రెస్ వామపక్షాలకు చెందిన సభ్యులు సైతం వీధి నిర్ణయాన్ని ఖండించారు. దీంతో ఆ తీర్మానాన్ని మమతాబెనర్జీ పక్కన పెట్టారు.

ఎం చేస్తారో?

బిజెపి పశ్చిమబెంగాల్లో పర నినాదాన్ని గ్రామస్థాయిలో కి కూడా తీసుకు వెళుతుంది. బిజెపి నిర్వహించే ప్రతి సభలోనూ ఈ నినాదాన్ని సభికులు అందరితో పాటూ వచ్చిన ప్రజానీకంతో సైతం గట్టిగా పలికిస్తూ కొత్త రాజకీయం మొదలు పెట్టింది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడ లో కి మమతా బెనర్జీ చిక్కుకున్నట్లు ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినప్పుడు లేదా ప్రతిఘటించి నప్పుడు వారు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ మరింత రెచ్చగొట్టడం బెంగాల్ లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణ ప్రజానీకం సైతం తృణమూల్ కాంగ్రెస్ నాయకులు లేదా కార్యకర్తలు ఏదైనా పాల్పడితే గట్టిగా జైశ్రీరామ్ నినాదాలు పలకడం ద్వారా బిజెపి వ్యూహం బెంగాల్లో చక్కగా అమలు అవుతున్నట్లు కనిపిస్తోంది. మమతా బెనర్జీ సైతం దీనిలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బిజెపి కు దీటుగా వ్యవహరించాలి అనుకున్న అది సాధ్యపడడం లేదు. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా వేస్తున్న ఎత్తుగడలు మమత చిక్కుకుని వాటి నుంచి బయటకు రాలేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో ముస్లిం జనాభా అధికం. వారి మద్దతు కచ్చితంగా మమతకు ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే మిగిలిన 70 శాతం జనాభా మీద ఎక్కువగా దృష్టి పెట్టిన బిజెపి… దానికి అనుగుణమైన పావులు కదపడం లో విజయవంతం అవుతుంది. దానిని నిలువరించడంలో మమత చాకచక్యంతో ఇప్పుడు ప్రధానం.

 

 

author avatar
Comrade CHE

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju