NewsOrbit
జాతీయం న్యూస్

Manipur: మణిపూర్ లో హింస .. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

Manipur violence govt issues shoot at sight orders

Manipur: మణిపూర్ లో హింస ప్రజ్వరిల్లడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో వైపు కేంద్ర బలగాలు ఎయిర్ ఫోర్స్ విమానంలో రాష్ట్ర రాజధాని ఇంపాల్ కు చేరుకున్నాయి. ఇంపాల్ లో ఆందోళనకారులు ఇప్పటికే అనేక వాహనాలను తగులబెట్టారు. ప్రార్థనా స్థలాలకు నిప్పుపెట్టారు. ముఖ్యంగా చురాచాంద్‌పూర్, ఇంపాల్ నగరాల్లో హింసాకాండ పెచ్చుమీరింది. మెజారిటీ గా ఉన్న మెయిటీలను షెడ్యూల్ తెగల కేటరిగిలో తేవాలనే డిమాండ్ ను ఎస్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తొంది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసన కారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నరనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది.

Manipur violence govt issues shoot at sight orders
Manipur violence govt issues shoot at sight orders

 

బుధవారం నిర్వహించిన సంఘీభావ ప్రదర్శనలో వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారని, ఈ ప్రదర్శన ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. తమ ప్రదర్శన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్ పూర్ లోని అంగ్లో – కూకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దీంతో హింస ప్రజ్వరిల్లిందని తెలిపింది.  ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ ఇంపాల్, తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్ధనా స్థలాలను తగులబెట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. ఈ హింసాకాండలో చాలా మంది గాయపడినట్లు, ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తొందన్నారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్రిక్తతలను సడలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనులు ప్రశాంతంగా ఉండాలని కోరారు.

మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ స్పందిస్తూ .. సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్ధాలే దీనికి కారణమని చెప్పారు. ఇరువర్గాలతోనూ సంప్రదింపులు జరిపి, వారి సుదీర్ఘ సమస్యలకు పరిష్కారాన్ని సాధిస్తామని చెప్పారు. గత 24 గంటల్లో జరిగిన విధ్వంసకాండలో విలువైన ప్రాణాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఇళ్లు, ఆస్తులకు నష్టం జరగడం దురదృష్టకరమని అన్నారు. తాజా పరిస్థితులపై సీఎం బిరేన్ సింగ్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించారు.

ప్రముఖ క్రీడాకారాణి మేరీ కోమ్ చేసిన ట్వీట్ లో నా రాష్ట్రం తగులబడుతోంది. దయచేసి సహయపడండి అని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పీఎంఓ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింద్, వివిధ మీడియా సంస్థలకు ఈ ట్వీట్ ను ట్యాగ్ చేసారు. ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ మణిపూర్ దుస్థితిని వివరించారు. అందరికీ రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తన హృదయాంతరాళాల్లోంచి కోరుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు.

హింసాకాండ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫూ విధించింది. రానున్న అయిదు రోజుల పాటు రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమచారం, పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. శాంతి భద్రతలను కాపాడటం కోసం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు సైన్యం కవాతు నిర్వహించిందై. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 7,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాల్లో భారత సైన్యం, అస్సాం రైఫిల్ సిబ్బంది పాల్గొంటున్నారు.

 హస్తినలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసిఆర్

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju