NewsOrbit
జాతీయం న్యూస్ బిగ్ స్టోరీ

అభయ కేసులో ఎన్నో ట్విస్ట్ లు… న్యాయం జరిగిన తెలిసేదెవరికి? సంతోషపడేవారెవరు??

 

 

అభయ… సిస్టర్ అభయ…. ఈ పేరు ఇప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు… 28 ఏళ్ల క్రితం మాత్రం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది…. కేరళలోని కొట్టాయం కు చెందిన సిస్టర్ అభయ మృతి అప్పట్లో సంచలనం అయ్యింది… ఆమె మృతి మీద 28 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.. 28 యేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న అభయ తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన తర్వాత సీబీఐ కోర్టు ఎన్నాళ్ళకు తీర్పు వెలువరించడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది… ఈ కేసు ఆసాంతం అనేక మలుపులు అనేక ట్విస్టులు.. ఉంటూ ముందుకు సాగింది. చివరకు కేరళ క్రైమ్ బ్రాంచ్ అధికారులు సైతం అభయ మృతి ఆత్మహత్య నిర్ధారించి కేసును మూసివేశారు… అసలు ఆ అభయ కేసులో ఏం జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం రండి..

సిస్టర్ అభయ కేరళలోని కొట్టాయం లో సైకాలజీ విద్యార్థిని… సీయంసి కళాశాల లో ఉంటూ అక్కడే వసతిగృహంలో ఉండి ఆమె చదువుకునేది.. ఆమె కాలేజీ ఓ మిషనరీ సంస్థకు చెందినది.. కేరళలో క్రైస్తవం ఎక్కువ. దాని మాటున జరిగే అఘాయిత్యాలు అధికమే… సిస్టర్ అభయ చదువుకుంటున్న కాలేజీల్లోనే ఫాదర్ థామస్ కొట్టుర్ లెక్చరర్ గా పని చేస్తూ ఉండేవారు. ఆయన కూడా అక్కడే వసతిగృహంలో ఉండేవారు. 1992 మార్చి 27వ తేదీ ఉదయం నాలుగు గంటలకు అభయ తాను చదువుకుంటున్న వసతిగృహంలో మంచి నీళ్లు తాగుదామని కిచెన్ లోకి వెళ్తుండగా… అక్కడ ఓ క్రైస్తవ సన్యాసిని తో ఫాదర్ థామస్ కొట్టుర్తో పాటు మరో వ్యక్తి ఓ క్రైస్తవ సన్యాసి నీతో అసభ్యకరంగా ఉండటాన్ని సిస్టర్ అభయ చూసింది. చూసిన వెంటనే ఆమె అరవడంతో… అక్కడున్న ఫాదర్ థామస్ కొట్టుర్ తో పాటు… నున్ షేఫీ.. మరో వ్యక్తి ఆమెను పట్టుకొని వంటగదిలోనే కట్టేశారు… అర వద్దని ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ప్రాధేయపడ్డా వినకపోవడంతో థమస్ కొట్టుర్ సిస్టర్ అభయను బలంగా కర్రతో తలపై భాగంతో ఆమె మృతి చెందింది. మృతి చెందిన అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడే ఉన్న బావిలో పడేశారు. ఇక్కడితో అభయ మృతి అయిపోలేదు…

నాలుగు రోజుల తర్వాత..

వసతి గృహంలో ఉండి చదువుకునే అభయ సభ్యులకు మూడు రోజులైనా ఫోన్ చేయక పోవడంతో వారు కళాశాలకు వచ్చే విచారించారు. అయితే ఆమె అక్కడ కనబడక పోవడంతో పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే కళాశాల సమీపంలోని బావి లో మహిళ మృతదేహం ఉందని సమాచారం అందింది. దీంతో వారు మృతదేహాన్ని వెలికి తీయించి గుర్తుల ఆధారంగా అభయ గా గుర్తించారు. అయితే ఆమె మృతికి సంబంధించి బలమైన ఆరోపణలు ఎవరిమీద లేకపోవడంతో పాటు తల్లిదండ్రులు సైతం ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయకపోవడంతో… కేసును ఆత్మహత్యగా పోలీసులు భావించి కేరళ క్రైమ్ పోలీసులు కేసును మూసివేశారు. పొరపాటున ఆమె బావిలో పడి ఉండవచ్చని లేదా ఆత్మహత్య చేసుకున్నప్పుడు తలపై గాయం అయి ఉండవచ్చని భావించారు.

జోమాన్ పుత్తన్ పురక్కాయ్ వదల్లేదు

అభయ మృతి కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను హక్కుల కార్యకర్త అయిన కేరళకు చెందిన జోమాన్ పుత్తన్సంపాదించారు.. దీంతో కేసు కొత్త మలుపు అందుకుంది. ఆయన కొన్ని కీలక విషయాలను పట్టుకుని, అభయ మృతికి గల కారణాలను బయటకు తీయాలనీ ఉద్యమించారు. అలాగే మానవ హక్కుల కమిషన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. కమిషన్ హై కోర్ట్ కు వెళ్లాలని సూచించడంతో కేరళ హైకోర్టు సూచనలతో సిబిఐ దర్యాప్తు 4 సంవత్సరాల తర్వాత అంటే 1996లో మొదలయ్యింది.
** ఈ కేసుకు సంబంధించి సిబిఐ దగ్గర ఆంటీ ఆధారాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు కష్టంగా మారింది. కేసును అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి అనే విషయంలో సీబీఐ అధికారులు సైతం తర్జనభర్జన పడ్డారు. అభయ కేసులో పోస్టుమార్టం కీలకంగా మారింది. ఆమెను బలంగా కొట్టడంతో నే మృతి చెందినట్లు ధ్రువీకరించు ఉన్న సీబీఐ అధికారులు ఈ కేసులో ఎవరినీ అనుమానించాలి ఎలా అనుమనిచాలి అనే విషయంలో గందరగోళం కు లోనయ్యారు. కళాశాలలో అనుమానంగా ఉన్న వారందరినీ విచారించారు. అందరిపై నిఘా ఉంచారు. చివరకు ఫాదర్ థామస్ కొట్టుర్ ప్రవర్తన కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో… అతడిని చాలా సంవత్సరాల తర్వాత విచారించగా నిజాలు వెలుగుచూశాయి. అప్పట్లోనే ఫాదర్ తో పాటు, నన్ షేఫీ ని ఫస్ట్ చేసిన అధికారులు 2009లో ఈ కేసులో చార్జిషీటు వేశారు. అప్పటి నుంచి దఫాలుగా విచారణ జరుగుతున్న ఈ కేసు… చివరకు 28 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చింది.. ఈ కేసులో మొదటి నుంచి పోరాడుతున్న అభయ తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన తర్వాత కేసు తీర్పు రావడం.. ఈ కేసులో మరో విశేషం. కనీసం అభయ కేసులో అన్యాయం జరిగింది అని తెలుసుకొని ఆనందించదగ్గ వారెవరూ ప్రస్తుతం లేరు.. కేవలం ఆమె కేసును తవ్వి తీసిన మానవ హక్కుల కార్యకర్త జోమాన్ పుత్తన్ తప్ప……….

author avatar
Comrade CHE

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N