21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
జాతీయం న్యూస్

సోనాలి ఫోగాట్ హత్య కేసులో కీలక పరిణామం.. గోవా సీఎం అభ్యర్ధనకు ఓకే చెప్పిన కేంద్రం

Share

బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ అనుమాానాస్పద మృతిపై దర్యాప్తునకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సిఫార్సు మేరకు కేంద్ర హోంశాఖ .. సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫోగాట్ కుటుంబ సభ్యులు స్వాగతించారు.

Sonali Phogat

కేంద్ర బీజేపీకి బిగ్ షాక్ .. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన కామెంట్స్

హర్యానాకు చెందిన నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్ గత నెలలో గోవాలోని ఓ హోటల్ రూమ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత ఆమె గుండె పోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. సొనాలి ఫోగట్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వీరి అనుమానాలకు బలం చేకూరేలా, పోస్టుమార్టం రిపోర్టులో ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో హత్య కేసుగా మార్పు చేసిన గోవా పోలీసులు.. ఫోగాట్ వ్యక్తిగత సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్ తో పాటు పలువురిని అరెస్టు చేశారు. మరో పక్క సోనాలి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించారు.

గోవా (పనాజీ) పోలీసులు విస్తృత దర్యాప్తు చేసినప్పటికీ హర్యానా ప్రజలతో పాటు సోనాలీ కుటుంబ సభ్యులు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. గోవా సీఎం సిఫార్సు చేసిన కొద్ది గంటల్లోనే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నుండి ఆదేశాలు జారీ అయ్యాయి.

దీదీకి మరో షాక్..బెంగాల్ మరో మంత్రిపై సీబీఐ దాడులు


Share

Related posts

Upasana Ram Charan : మహిళలందు ఉపాసన వేరయా..! ఎంతో మందికి ఆమె స్ఫూర్తి అందుకే..!!

bharani jella

గోరంట్ల పోటీకి లైన్ క్లియర్

sarath

మూడు హత్యలకు దారితీసిన మూడు నిమిషాల ‘సుఖం’!చెన్నై ట్రిపుల్ మర్డర్ వెనక చీకటి కోణం!

Yandamuri