NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

యానాంలో ఆమరణ దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్…ఉద్రిక్తత..భారీగా పోలీసుల మోహరింపు

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు డిమాండ్ల పరిష్కారానికి ఆమరణ దీక్ష చేస్తుండగా, మరో పక్క 19వ ప్రజా ఉత్సవాల ముగింపు వేడుకలకు పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి రంగస్వామి రానుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘనటలు జరగకుండా యానాంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గత ఎన్నికల్లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ప్రస్తుత ముఖ్యమంత్రి రంగస్వామి పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Yanam

 

గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానాంలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న 15 సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండు నెలల క్రితం పుదుచ్ఛేరి అసెంబ్లీ ముందు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రంగ స్వామి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో గొల్లపల్లి దీక్ష విరమించారు. అయితే రెండు నెలలు దాటుతున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ముఖ్యమంత్రి రంగస్వామిపై యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హామీలను నెరవేర్చి యానాంకు వస్తే పూలతో స్వాగతం పలుకుతాం, లేకపోతే చెప్పుదెబ్బలతో స్వాగతం పలుకుతామని గొల్లపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో యానాంలోనే కాక పుదుచ్చేరి వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.

Gollapalli srinivas Ashok

 

ముఖ్యమంత్రి రంగస్వామి ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగా ఎమ్మెల్యే గొల్లపల్లి యానాంలో ఆమరణ దీక్ష కు దిగారు. శుక్రవారం నుండి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గొల్లపల్లి అభిమానులు నిన్న యానాం బంద్ కు పిలుపు నివ్వడంతో వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. గొల్లపల్లి ఆమరణ దీక్ష ఆదివారం మూడవ రోజుకు చేరుకుంది. యానాంలో పరిస్థితులు ఈ విధంగా ఉండగా నేడు జరుగు 19వ ప్రజా ఉత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి రంగ స్వామి హజరు కానున్నారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గీక్షకు ఏపికి చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. గొల్లపల్లికి ఏమైనా జరిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పుదుచ్చేరి పాలకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఓ పక్క స్థానిక ఎమ్మెల్యే ఆమరణ దీక్ష, మరో పక్క సీఎం పర్యటన నేపథ్యంలో ఏమి జరుగుతుందో అన్నటెన్షన్ యానాం ప్రజల్లో నెలకొంది.

Breaking: నల్లకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు ఖమ్మం జిల్లా వాసులు మృతి

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!