NewsOrbit
జాతీయం టాప్ స్టోరీస్ ట్రెండింగ్ రాజ‌కీయాలు

Modi: మోడీ పై విరుచుకుప‌డే ఏ చాన్స్ వ‌దులుకోని మ‌మ‌త‌

Modi: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ని టార్గెట్ చేసే విష‌యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏ చాన్స్ వ‌దులుకోని మ‌మ‌త పెగాసస్ స్పైవేర్‌తో అనేక మంది నేతలపై నిఘా పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెగాసస్ స్పైవేర్‌ నిఘా నుంచి తప్పించుకోవడం కోసం తన మొబైల్ ఫోన్‌ కెమెరాకు ప్లాస్టర్ వేసేశానని, ఇక కేంద్ర ప్రభుత్వానికి ప్లాస్టర్ వేయవలసి ఉందని చెప్పారు.

Read More : Modi: తండ్రి కాంగ్రెస్‌… కొడుకు బీజేపీ… మోడీ వ‌ల్లే ఇద్ద‌రు క‌లిసి సృష్టించిన‌ రికార్డు ఇది

మ‌మ‌త ఏమంటున్నారంటే…
అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వర్చువల్ పద్ధతిలో జరిగిన కార్యక్రమంలో మ‌మ‌త బెన‌ర్జీ ప్రసంగించారు. పెగాస‌స్ చాలా ప్ర‌మాద‌క‌రం. వాళ్లు వ్య‌క్తుల‌ను హింసిస్తున్నారు. కొన్నిసార్లు నేను ఎవ‌రితోనూ మాట్లాడ‌లేక‌పోతున్నాను. ఢిల్లీ లేదా ఒడిశా చీఫ్ మినిస్ట‌ర్‌ల‌తో మాట్లాడ‌లేక‌పోతున్నాన‌ని ఆమె అన్నారు. దేశంలో స్పైగిరి జరుగుతోందని, మంత్రులు, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫోన్ల హ్యాకింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీక‌రించాల‌ని ఆమె కోరారు.

Read More : BJP: బీజేపీ ఆ విష‌యంలో కేసీఆర్‌ను వ‌దిలిపెట్ట‌ట్లేదుగా!

ప్ర‌మాదంలో ప్రజాస్వామ్యం…

ఎన్నికల ప్రక్రియ, న్యాయ వ్యవస్థ, మంత్రులు, మీడియా హౌస్‌లను పెగాసస్ ఆక్రమించుకుందని మ‌మ‌త బెన‌ర్జీ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి బదులుగా నిఘా రాజ్యంగా మార్చాలనుకుంటున్నారన్నారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుంటూ.. దేశాన్ని ఓ నిఘా కేంద్రంగా చేయాల‌నుకుంటున్నారా అంటూ మమత ప్ర‌శ్నించారు. స్వేచ్ఛ ప్ర‌మాదంలో ప‌డిందని, దీనికి బీజేపీయే కార‌ణమన్నారు. వాళ్లు త‌మ మంత్రుల‌నే విశ్వ‌సించ‌డం లేదు. వాళ్లు అన్ని ఏజెన్సీల‌ను దుర్వినియోగం చేస్తున్నారని మ‌మ‌త విమ‌ర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు.

author avatar
sridhar

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju