Modi: “చంద్రాయన్-3” సక్సెస్ తో భారతదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. చంద్రుని పై దక్షిణ ద్రవం వద్ద మొదట చేరుకున్న దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ కీర్తించబడుతుంది. ఇలాంటి దారుణంలో భారత్ సరిహద్దుల వద్ద డ్రాగన్ కంట్రీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. విషయంలోకి వెళ్తే భారత్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతో సోమవారం చైనా కొత్త మ్యాప్ విడుదల చేసింది. “ది 2023 ఎడిషన్ ఆఫ్ చైనా స్టాండర్డ్ మ్యాప్” పేరుతో చైనా సహజ వనరుల శాఖ రూపొందించిన ఈ మ్యాప్ నీ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ మ్యాప్ లో పరుగు దేశాలతో కలిగి ఉన్న జాతీయ సరిహద్దులను డ్రాయింగ్ పద్ధతి ద్వారా తమదే అన్నట్టు చూపుతూ ఉంది.
భారత్ లోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల ప్రదేశ్ ను చైనా ఎప్పటినుంచో దక్షిణ టిబేట్ గా పేర్కొంటూ చూపుతూ వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ అవతలి వైపు చైనా భూభాగంలో ఎలాంటి గ్రామాలు ఇంక నివాసాలు లేకపోయినా ఇటీవల కాలంలో.. చైనా పెద్ద ఎత్తున గ్రామాలను నిర్మించింది. తద్వారా ఎప్పటినుంచో అక్కడ గ్రామాలు.. నివాసాలు ఉన్నాయని అరుణాచల్ ప్రదేశ్.. చైనాలో భాగమని కుట్రపూరిత ప్రణాళిక రచించింది. తాజాగా చైనా విడుదల చేసిన ఈ మ్యాపులో అరుణాచల్ ప్రదేశ్ తో పాటుగా కాశ్మీర్ లోని ఆక్సయ్ చిన్ ప్రాంతాన్ని తమ దేశ భూభాగాలుగా మ్యాప్ లో చూపించింది. 1962వ సంవత్సరంలో భారత్.. చైనా మధ్య జరిగిన యుద్ధంలో ఆక్సయ్ ప్రాంతాన్ని చైనా దురాక్రమించింది. అప్పటినుంచి ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లోనే ఉంచుకుంది.
ఇక ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ తో పాటు మరికొన్ని ప్రాంతాలపై డ్రాగన్ కంట్రీ కన్ను వేయడంతో మోడీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. గతంలో లడక్ సమీపంలో గాల్వాన్ లోయలో భారత్ సైనికుల చేతిలో చైనా సైనికులు చావు దెబ్బ తినటం తెలిసిందే. అయినా గాని చైనా తన వంకర బుద్ధి పోనీచ్చుకొని నేపథ్యంలో..మోడీ ప్రభుత్వం దీటుగా జవాబు ఇవ్వాలని రెడీ అయింది. ఈ క్రమంలో చైనా తన కొత్త మ్యాప్ లో భారత్ కి చెందిన భూభాగాలను తమదే అని చూపిస్తున్న.. ప్రాంతాలలో భారీ ఎత్తున యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లను… రంగంలోకి దింపడానికి మోడీ ప్రభుత్వం రెడీ అయిందట. చైనా దురాక్రమణ విషయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి కూడా నరేంద్ర మోడీ ఇప్పుడు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.