Modi, shah and Rahul wished peoples for Telangana Formation Day celebrations
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం కేసిఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని దుయ్యబట్టారు కేసిఆర్. మరో పక్క రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా వీరందరూ తెలుగులో శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడటంతో పేరు పొందిన వారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటూ కితాబు ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణ రాష్ట్ర సంస్కృతి అని కొనియాడారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సుకై తాను ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు ప్రధాని మోడీ. దేశ ప్రగతి కోసం కట్టుబడిన యువత కృషితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తెలంగాణ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ రాష్ట్ర అభివృద్ధి దిశగా పయనించాలని అకాంక్షించారు షా. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేశారు.
అయితే ఈ ఇద్దరు నేతలకంటే ముందుగా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “తమ పోరాట స్పూర్తితో యావత్ దేశానికి స్పూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసోదరీమణులందరికీ తెలంగాణ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, ఈ చారిత్మాత్మక రోజున ఆమరవీరుల, వారి కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరించుకుందాం, గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో దారుణమైన పాలనను చవిచూసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజలకు శ్రేయస్సును తీసుకురావడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా, ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను” అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…