NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ బిగ్ స్టోరీ

Drugs Case: డ్రగ్స్ కేసు వెనుక దాగున్న భయానక నిజాలు ఇవి..! దొరికితే దొంగ దొరక్కపోతే..!?

Drugs Case: రాష్ట్ర ప్రభుత్వం తో లింకులు ఉన్న డ్రగ్స్ స్కామ్ ఒకటి ఇటీవల బయటపడింది. గుజరాత్ లోని మొండ్రా పోర్టులో తొమ్మిది వేల కోట్ల విలువైన మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడింది. ముండ్రా పోర్టు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీ గ్రూప్ చెందినది. అక్కడి పోర్ట్ నుండి ఆంధ్రప్రదేశ్ కు రావలసిన మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీంతో గుజరాత్ కు ఆంధ్రప్రదేశ్ కు మధ్య డ్రగ్స్ గుట్టు ఏదో ఉందని బయటకు వచ్చింది. దీని విలువ కూడా భారీగా ఉండటంతో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా దీనిపై ఫోకస్ పెట్టాయి. ఈ డ్రగ్స్ రవాణాకు సంబంధించి సోషల్ మీడియాలో టీడీపీ అనుకూల మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వస్తుండగా, దీనిపై ప్రభుత్వానికి, వైసీపీకి సంబంధం లేకపోతే సాక్షి మీడియాలో ఎందుకు కథనాలు ఇవ్వటం లేదు?. టిడిపి అనవసరంగా రాద్ధాంతం చేస్తుందనో, ప్రభుత్వానికి వైసిపికి సంబంధం లేదనో ఏదో ఒకటి రాయాలి కదా, కానీ సాక్షి దాని గురించే రాయడం లేదు. ఆ డ్రగ్స్ ఎవరివి? ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నాయి. పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది అంటూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేలాసాక్షి లో కథనాన్ని ఎందుకు ఇవ్వలేదు?. ఆదాని పోస్టులో డ్రగ్స్ దొరికాయి కాబట్టి సంచలనం విషయం అయ్యింది. దొరకకుండా ఎన్నెన్నో పోతున్న విషయం అందరికీ తెలిసిందే.

దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అంబానీ, ఆదాని ఆస్తులు విపరీతంగా పెరిగాయి. దీనిలో భాగంగా చాలా పోర్టులు ఆదోని పరం అవుతున్నాయి. ఏపిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా పది శాతం ఉంటే అదీ కూడా ఆదానీకి అమ్మేశారు. కృష్ణపట్నంలో నవయుగ కు 75 శాతం ఉంటే వాళ్లకు పూర్తిగా పక్కకు వెళ్లి అదానీకి ఇచ్చేశారు. వేరే పోర్టులు కూడా ఆదానీకి ఇవ్వడానికి మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే కొత్త పోర్టులు రానివ్వడం లేదు. కృష్ణపట్నం పోర్టు ఆదానీ చేతిలో ఉంది. గంగవరం పోర్టు ఆదానీ చేతిలో ఉంది. ఇక కాకినాడ పోర్టు, విశాఖపట్నం పోర్టు, విశాఖపట్నం పోర్టు కేంద్ర ప్రభుత్వానిది కావడంతో ఎవరి చేతిలోకి వెళ్లదు. కాకినాడ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మేజర్ వాటా ఉండటం వల్ల దాని జోలికి వెళ్లడం లేదు. బహుశా అది కూడా కొనేస్తే కొనేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే కొత్త పోర్టులు ఎందుకు రావడం లేదు. ప్రకాశం జిల్లా రామయపట్నం పోర్టు ఎందుకు రావడం లేదు. ఎవరైనా ఆలోచించారా. అదే విధంగా మచిలీపట్నం పోర్టు. ఇది ఎందుకు రావడం లేదని ఆలోచించారా. ఎందుకు వాటి అడుగులు పడటం లేదు. నిర్మాణం జరగడం లేదని. కొత్త పోర్టులు రావు. రానివ్వరు. కొత్త పోర్టులు వస్తే పాట పోర్టులకు రవాణా తగ్గిపోతుంది. ఇలాంటి అక్రమ రవాణాలు తగ్గుతాయి. తద్వారా వాటి ఆదాయం కూడా తగ్గుతుంది. సో..కొత్త పోర్టులు వస్తే ఇప్పుడు ఉన్న పోర్టులు ఆదానీ చేతిలో ఉన్నాయి. కొత్త పోర్టులు కూడా వారి చేతికి వచ్చే అవకాశం ఉంటే ఈసీగానే వస్తాయి. ఒక వేళ కొత్త పోర్టులు వేరే వారికి వస్తే వీరి బిజినెస్ జరగదు కాబట్టి ప్రభుత్వాలకు, ఈ కార్పోరేట్ సంస్థలకు ఉన్న సంబంధం కారణంగా కొత్త పోర్టులను రానివ్వరు.


దొరికితేనే దొంగ. దొరకపోతే దొరే. ఇప్పుడు ముండ్ర పోర్టులో 3వేల కేజీల హెరాయిన్ పట్టుబడింది. అక్కడ డీఆర్ జీ కొత్త అధికారి వచ్చారు కాబట్టి తనిఖీల్లో 3వేల కేజీల హెరాయిన్ దొరికింది. పాత అధికారులు ఇప్పటి వరకూ చెక్ చేయకుండా ఎన్నింటిని వదిలివేశారో తెలియని పరిస్థితి. ఎన్ని వేల కిలోలు అక్రమ రవాణా జరిగిందో. ఇది బయటకు వచ్చింది కాబట్టి సంచలన వార్త అయ్యింది. బయటకి రానివి రోజుకు సుమారుగా పదివేల కిలోల ఉంటుంది. రోజుకు సుమారుగా రూ. 50వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ పోర్టు నుండి చుట్టుపక్కల రాష్ట్రాలకు రవాణా అవుతుంటుంది. మేజర్ పోర్టుల్లో ఆదానీ వాటా ఉంటుంది. ఆ పోర్టుల నుండి ఈ రకమైన అక్రమ రవాణాలు లెక్కకు మించి జరుగుతూనే ఉంటాయి. పట్టించుకోవాలంటే ఆదానీ పోర్టులు అన్నింటిపై కాన్సట్రేషన్ చేయాలి. డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో దృష్టి సారించాలి. ఇప్పుడు దొరికిన 3వేల కిలోల హెరాయిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అయ్యిందా అంటే లేదు. కేంద్ర హోంశాఖకు సంబంధం లేదా. ఈ పట్టుబడిన హెరాయిన్ ఎక్కడి నుండి వచ్చింది. ఎక్కడికి వెళుతుంది, ఇప్పటి వరకూ ఎంత వరకు లావాదేవీలు జరిగాయి అనేది కేంద్రం దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదా. అంత వేల కోట్ల విలువైన డ్రగ్స్ అయినప్పుడు ఏ దేశం నుండి వస్తుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత లేదా. కానీ కేంద్రం సీరియస్ గా పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే అది అదానీ పోర్టు కావడమే.

అలాగే పట్టుబడిన హెరాయిన్ విజయవాడ అడ్రస్ పేరుతో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుడి బంధువు సుధాకర్ అనే వ్యక్తి పేరు మీద హెరాయిన్ వస్తోందని ఇలా ఏవేవో ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అయినా దీనిపై కేంద్రానికి లేఖ రాయాలి. గుజరాత్ రాష్ట్రంలోని పోర్టు నుండి మా రాష్ట్రానికి హెరాయిన్ పెద్ద ఎత్తున రవాణా అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, సీబీఐ దర్యాప్తు చేయించండి వీటిపై నిజాలు నిగ్గు తేల్చండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు కోరలేదు. ఈ డ్రగ్స్ విషయంలో ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. సైలెంట్ అయిపోతున్నారు. అదీ కాక ఇది మాకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. ఎందుకుంటే అది ఆదానీ పోర్టు కావడమే. ప్రస్తుతం డ్రగ్స్ దొరికాయి కాబట్టి వారం రోజులు వార్తలు ఉంటాయి. ఆ తరువాత యధా మమూలుగా రవాణాలు జరుగుతూనే ఉంటాయి. ఇటువంటివి జరుగుతుండటం వల్లనే వారి సంపద వివరీతంగా పెరిగిపోతున్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!