జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

అజాద్ పార్టీ ప్రకటనతో జమ్ముకశ్మీర్ లో ఖాళీ అవుతున్న జాతీయ కాంగ్రెస్ … అజాద్ తో సమావేశమైన జీ – 23 కీలక నేతలు.. ఎందుకంటే..?

Share

జమ్ముకశ్మీర్ లో జాతీయ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగులుతోంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడిన సంగతి తెలిసందే. అయిదు దశాబ్దాల పార్టీ అనుబంధాన్ని తెంచుకున్న అజాద్ .. బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగినా ఆ వాదనలను ఆయన ఖండించారు. జమ్ముకశ్మీర్ కేంద్రంగా జాతీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అజాద్ కొత్త పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఆజాద్ రాజీనామా చేసిన నాటి నుండి ఇప్పటి వరకూ 64 మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆజాద్ కు మద్దతుగా మంగళవారం పార్టీకి రాజీనామా చేసిన వారిలో జమ్ముకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ కూడా ఉన్నారు. పార్టీకి గుడ్ బై చెప్పిన నేతలు అందరూ తమ రాజీనామా లేఖలను సోనియా గాంధీకి పంపించారు.

 

తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, షురు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ సహా పలువురు సీనియర్ నాయకులు తమ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆజాద్ కు మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,, పిఆర్ఐ సభ్యులు, జిల్లా, బ్లాక్ స్థాయి నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అజాద్ కు మద్దతు తెలియజేశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితికి చేరిపోతుంది.

మరో పక్క ఈ రోజు జీ – 23 నేతల్లో ముఖ్యలైన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృద్విరాజ్ చౌహాన్, ఆనంద్ శర్మ, భూపేందర్ హుడా లు అాజాద్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడి కోసం అంతర్గత ఎన్నికలకు సోనియా అంగీకరించిన తర్వాత తమతో సంప్రదించకుండానే ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చిందని అజాద్ ను వీరు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్టీ వీడటానికి దారి తీసిన పరిస్థితులను అజాద్ వారికి వివరించారు. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యుల్ ప్రకటించిన విషయంపై చవాన్ స్వాగిస్తూ గాంధీలు అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి నిరాకరించారు. ఎన్నికలు స్వేచ్చగా, నిష్పక్షపాతంగా జరగాలని ఆయన అన్నారు.


Share

Related posts

పెళ్లి అనేది అంత ఇంపార్టెంటా లైఫ్ లో? షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ?

Varun G

ఈ చెట్టు గురించి ఎవరికీ తెలియని అద్భుత విశేషాలు..!

bharani jella

బిగ్ బాస్ 4 : కంటెస్టెంట్లకు భారీ షాక్..! ఈ వారం మధ్యలోనే ఎలిమినేషన్….!

arun kanna