NewsOrbit
జాతీయం న్యూస్

National Herald Case: రాహుల్ అభ్యర్ధనను తిరస్కరించిన ఈడీ..నేడు మూడవ రోజు విచారణ

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత రెండు రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తొలి రోజు సోమవారం పది గంటలకు పైగా రాహుల్ గాంధీని విచారించిన ఈడీ అధికారులు, రెండవ రోజు మంగళవారం (నిన్న) ఏకంగా 11 గంటల పాటు విచారణ చేశారు. ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ, భోజనం విరామం తరువాత తిరిగి 4.30 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకూ విచారణను ఏకబిగిన కొనసాగించారు.

National Herald Case Rahul Gandhi third day questioning ED today
National Herald Case Rahul Gandhi third day questioning ED today

National Herald Case: ఆచిచూచి సమాధానాలు ఇస్తున్న రాహుల్ గాంధీ

ముందుగా యంగ్ ఇండియన్ కంపెనీలో రాహుల్ గాంధీ పెట్టుబడులు, ఆ కంపెనీతో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)తో లావాదేవీల డాక్యుమెంట్లను ఆయన ముందు ఉంచి చదవాలని కోరారు. ఆ వ్యాపారాల్లో ఆయన పాత్రపైనా పలు ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీని కనీసం 25 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈడీ అధికారుల ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఆచిచూచి సమాధానాలు చెప్పారనీ, ఏ ప్రశ్నను ఎలా తప్పించుకోవాలన్న దానిపై ముందుగా న్యాయవాదులు ఆయనకు బాగా శిక్షణ ఇచ్చినట్లు కనిపిస్తొందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. విచారణ జాప్యానికి కారణం మీరేనని ఈడీ అధికారులు చెప్పడంతో అందుకు రాహుల్ క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలుస్తొంది. విచారణలో కోల్‌కతా కు చెందిన డొటెక్స్ మర్కండైజ్ సంస్థకు ఉన్న సంబంధాలపైనా అధికారులు రాహుల్ ను ప్రశ్నించారు. కాగా విచారణ ఆలస్యమైనా ఫరవాలేదు మంగళవారమే విచారణ పూర్తి చేయాలని ఈడీ అధికారులకు రాహుల్ విజ్ఞప్తి చేయగా వారు అందుకు నిరాకరించారు. బుధవారం కూడా విచారణకు హజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ రోజు కూడా ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొనున్నారు.

 

కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు

మరో పక్క ఏఐసీసీ కార్యాలయం వద్ద  రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ శ్రేణులు మూడవ రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. కార్యాలయ ఆవరణలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఏఐసీసీ కార్యాలయం వద్ద మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.  కాగా ఇదే కేసులో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన ఈడీ విచారణకు హజరుకావాల్సి ఉంది. ఈ మేరకు సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం సోనియా గాంధీ కోవిడ్ అనంతర సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk