NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Sarad Pawar: సంచలన నిర్ణయం ప్రకటించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్

Sarad Pawar: ఎన్‌సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ) అధినేత శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన పవార్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ మహాకూటమి ఏర్పాటులో పవార్ దే కీలక పాత్ర అనే సంగతి అందరికీ తెలిసిందే. దేశ రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి కీలక నేత ఒక్క సారిగా ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

NCP Chief sarad pawar Key decision announced

 

ఇంత హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్న చర్చ జరుగుతోంది. మరో వైపు ఆయన వారసుడిగా పార్టీ తదుపరి అధ్యక్ష బాధ్యతలు ఎవరు తీసుకోబోతున్నారనే విషయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు. పార్టీ అధ్యక్షుడుగా శరద్ పవార్ యే కొనసాగాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు. మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీ చేరబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న తరణంలో శరద్ పవార్ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవి నుండి మాత్రమే తప్పుకుంటాననీ, ప్రజా జీవితం నుండి కాదని ఆయన పార్టీ శ్రేణులకు చెబుతున్నారు.

వయసు మీద పడుతుండటం, అనారోగ్యం కారణంగానే శరద్ పవార్ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నట్లు ఆయన తెలుపుతున్నారు. మరో పక్క తన కుమార్తె, ఎంపీ సుప్రీయా సూలేకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టేందుకే శరద్ పవార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతలు మాత్రం రాజీనామా చేయవద్దంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

తీహార్ జైలులో గ్యాంగ్ వార్ .. గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియా హత్య

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!