జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో సారి నిషేదిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థ కార్యకలాపాలపై దాడులు నిర్వహిస్తొంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో డజనుకు పైగా ప్రదేశాల్లో ఈ సోదాలు జరుపుతోంది. బీహార్ లో 12, ఉత్తరప్రదేశ్ లో రెండు, పంజాబ్ లోని లుథియానా, గోవాలో ఒకొక్క ప్రదేశాల్లోని పీఎఫ్ఐ కార్యకర్తలు, నేతల నివాసాల్లో రైడ్స్ జరుగుతున్నాయి.

బీహార్ లోని దర్బంగా నగరంలోని ఉర్దూ బజార్ లో ఉన్న దంత వైద్యుడు డాక్టర్ సరిక్ రజా, మరియు సింఘ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ పూర్ గ్రామానికి చెందిన మెహబూబ్ నివాసాలపై అధికారులు దాడులు చేసి సోదాలు జరుపుతున్నారు. అదే విధంగా బీహార్ లోని మోతిహరిలోని మరో ప్రదేశంలో, తూర్పు చంపారన్ జిల్లాలోని చకియా సబ్ డివిజన్ లోని కువాన్వా గ్రామంలో ఎన్ఐఏ బృందం సోదాలు జరుపుతోంది. పీఎఫ్ఐ కి సంబంధించిన కేసులో సజ్జద్ అన్సారీ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. సజ్జాద్ గత 14 నెలలుగా దుబాయి లో పని చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సజ్జాద్ నివాసం నుండి అతని అధార్ కార్డు, పాస్ పోర్టు, కొన్నికీలక పత్రాలు ఎన్ఐఏ బృందం స్వాధీనం చేసుకున్నది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దాని అనుబంధ సంస్థలపై నిషేదించిన విషయం తెలిసిందే. ఈ సంస్థలోని నేతలు, సభ్యులు ఉగ్రవాద చర్యలు, ఫైనాన్సింగ్, శాంతి భద్రతలకు భంగం కల్గించడం తదితర నేరాలకు పాల్పడుతున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. దేశ సమగ్రత, భద్రత, సార భౌమత్వానికి భంగం కల్గించేలా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలైన ఆర్ఐఎఫ్, సీఎఫ్ఐ, ఏఐఐసి, ఎన్సీహెచ్ఆర్ఓ, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ మరియు రిహాబ్ ఫౌండేషన్ (కేరళ) లపై నిషేదం విధించింది.
పోలీసులపై చేయి చేసుకున్న కేసులో షర్మిలకు 14 రోజుల రిమాండ్ .. చంచల్‌గూడ జైలుకు తరలింపు