జాతీయం

NIA: దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) కార్యాలయాలపై NIA సోదాలు..!!

Share

NIA: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) కార్యాలయాలపై సోదాలు జరుపుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, కర్ణాటక తమిళనాడు..సహా మొత్తం పది రాష్ట్రాలలో PFI కి చెందిన కీలక నాయకుల ఇళ్లల్లో ఈడి, లోకల్ పోలీసులతో కలిసి NIA సాదాలు చేస్తూ ఉంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్, గుంటూరు.. తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

nia raids  pfi offices in ten states
NIA ED Raids on PFI

ఈ క్రమంలో PFIకి చెందిన 100 మందిని NIA అరెస్టు చేయడం జరిగింది. PFI చైర్మన్ ఓఎంఏ సలాం సహా పలువురు కీలక నాయకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో సోదరులు నిర్వహించిన NIA.. అక్కడి PFI కార్యాలయాన్ని సీజ్ చేసింది. సోదాలలో హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. విచారణకు హాజరుకావాలని చాంద్రాయణగుట్ట PFI నేతలకు NIA అధికారులు నోటీసులు జారీ చేశారు.

nia raids  pfi offices in ten states
NIA ED Raids on PFI

ఇంకా కరీంనగర్, హైదరాబాద్ ఎల్బీనగర్, ఆటోనగర్ ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో పరారీలో ఉన్న PFI మాజీ కార్యకర్త కోసం గాలిస్తున్నారు. PFI కి అసలు నిధులు ఎక్కడినుండి వస్తున్నాయి అనే కోణంపై NIA దర్యాప్తు చేపడుతుంది. అంతేకాదు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చరానే కోణంలో కూడా.. విచారణ చేస్తున్నారు. అలాగే ఉగ్రవాద సంస్థల్లో యువతను ప్రోత్సహిస్తున్నట్లు NIA భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర హోమ్ శాఖ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలు రావటంతో NIA తో పాటు ఈడి కూడా దాడులు చేస్తూ ఉంది. గతంలో జరిగిన విచారణలో PFI కరాటే ముసుగులో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పుడు అందుకున్న సమాచారం మేరకు దేశవ్యాప్తంగా PFI కార్యాలయాలపై NIA.. ఈడి దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి.


Share

Related posts

Maharashtra Politics: ‘మహా’ బలపరీక్షలో నెగ్గిన సీఎం ఏక్ నాథ్ శిందే .. మరో సారి సుప్రీంను ఆశ్రయించిన ఠాక్రే వర్గం

somaraju sharma

Corona: క‌రోనా వ్యాక్సిన్ … రెండు గుడ్ న్యూస్‌లు

sridhar

‘గర్జించే సింహాల చిహ్నం’పై ముదురుతున్న వివాదం ..మార్చాలంటూ విపక్షాల పట్టు.. పీఎం మోడీ ఏమంటారో..?

somaraju sharma