29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

సీబీఐ కి నో ఎంట్రీ బోర్డులు పెట్టిన రాష్ట్రాలు ఇవే..

Share

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రయోగించి ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఎప్పటి నుండో ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా పలు రాష్ట్రాలు ముందస్తు అనుమతి లేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేయడానికి వీలు లేదంటూ నిర్ణయాలను తీసుకున్నాయి. ఇలా సీబీఐ ని నిరోధించిన రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరామ్, పంజాబ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

AP Politics: CBI Changed by BJP Influence..?

 

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో బేధాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలను చూపుతూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకి సాధారణ అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పై తొమ్మిది రాష్ట్రాలు సీబీఐ నిరోధించాయని కేంద్రం బుధవారం వెల్లడించింది.  కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రసాద్ బుధవారం పార్లమెంట్ సాక్షిగా సీబీఐ ని దర్యాప్తును అడ్డుకున్న రాష్ట్రాల వివరాలు వెల్లడించారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపి ప్రభుత్వం కూడా సీబీఐని నిరోధిస్తూ నిర్ణయం తీసుకుని కేంద్రానికి లేఖ రాశారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అందికారం వచ్చిన తర్వాత సీబీఐకి సమ్మతి తెలియజేశారు. అయితే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సీబీఐని నో ఎంట్రీ బోర్డులు పెట్టగా, అక్కడి ప్రతిపక్షాలు మాత్రం వివిధ కేసుల్లో సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి.

రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ను ఏర్పాటు చేయగా, ఆ రాష్ట్ర బీజేపీ .. కేసును సీబీఐ దర్యాప్తుకు ఇవ్వడం గానీ లేక హైకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతోంది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుపుతోంది.

బీజేపీ నేత కన్నాతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ ..రీజన్ ఎమిటంటే..?


Share

Related posts

Roja : రోజా ఇలాకాలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం… వార్నింగ్ ఇచ్చిన‌ట్లేనా?

sridhar

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ రవి.. గాలి తీసేసిన శ్వేత..!!

sekhar

తెలంగాణ విద్యాసంస్థల మూసివేత పై వివాదం

Siva Prasad