Nupur Sharma Comments Row: మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు గానూ బీజేపీ నుండి బహిష్కరణ కు గురైన నువూర్ శర్మ, నవీన్ జిందాల్ లకు మహారాష్ట్రలోని భీవండి పోలీసులు ఆదివారం సమన్లు జారీ చేశారు. మే 30న రజా అకాడమి ప్రతినిధి చేసిన ఫిర్యాదుపై వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ ఇన్స్ పెక్టర్ చేతన్ తెలిపారు. జూన్ 15న వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా నవీన్ జిందాల్ ను కోరినట్లు ఆయన చెప్పారు. అంతకు ముందు ముంబ్రా పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి జూన్ 22న తమ ముందు హజరుకావాలని నుపుర్ శర్మను కోరారు. దీంతో పాటు ముంబాయి పోలీసులు జూన్ 25న హజరుకావాలని ఆమెను కోరారు.
నువూర్ శర్మ, నవీన్ జిందాల్ ను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. ఆ ఘటనల ప్రభావం కొన్ని ప్రాంతాల్లో శనివారం, ఆదివారం కూడా కనిపించాయి. రాంచీ, ప్రయాగ్ రాజ్, హౌరా, నదియా ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు నమోదు అయిన సంగతి తెలిసిందే. రాంచీలో శుక్రవారం జరిగిన ఘర్షణల్లో గాయపడిన ఇద్దరు వ్యక్తులు శనివారం రాష్ట్ర రాజధానిలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మరణించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి 144 సెక్షన్ కింద నిషేదాజ్ఞలను కొనసాగిస్తున్నారు. కాగా నేడు పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలోని బేతుఅదహరి రైల్వే స్టేషన్ లో లోకల్ ట్రైన్ పై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. నువూర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించిన ఆందోళన కారులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లోకి దుసుుకువెళ్లి రైలుపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. నువూర్ శర్మను అరెస్టు చేయాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే డిమాండ్ చేశారు.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…