NV Ramana Vs Amith shah: దేశంలో సంచలన బ్రేకింగ్..! ఆ విషయంలో ఎన్వీ రమణ వర్సెస్ అమిత్ షా..!?

Share

NV Ramana Vs Amith shah: దేశంలో రెండు వ్యవస్థల మధ్య అంతర్లీనంగా రగులుతున్న విబేధాలను, వివాదాలను లేవనెత్తే సంచలనాత్మక విషయం ఇది. అయితే పూర్తిగా ఇది జరుగుతుంది అని చెప్పలేము కానీ ఆ అవకాశాలు మాత్రం ఇవి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న చేసిన కొన్ని కామెంట్స్ ను పరిశీలిస్తే అవి ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు వ్యాఖ్యలకు కౌంటర్ లుగా భావించాల్సి ఉంటుంది. అదే విధంగా దేశం మొత్తం మీద పోలీసుల పనితీరును ప్రభావితం చేసేవిలా ఉన్నాయి. ఈ విషయంలో జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు ఒకలా ఉంటే అమిత్ షా కామెంట్స్ మరోలా ఉన్నాయి.

NV Ramana Vs Amith shah sensational comments
NV Ramana Vs Amith shah sensational comments

అమిత్ షా ఏమన్నారంటే..దేశంలో భావ ప్రకటనా స్వేచ్చ బలపడాలి. వ్యక్తి స్వాతంత్రను కాపాడాలి. ఇవి జరగాలి అంటే పోలీసులు బలంగా పని చేయాల్సి ఉంది. వ్యక్తుల హక్కుల కోసం, పౌర సమాజం కోసం పోలీసులు మరింత సమర్థవంతంగా పని చేయాలి అంటూనే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంఘటనలను సాకుగా చూపించి పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా పోలీసులను కించపరిచేలా కొంత మంది మాట్లాడుతున్నారు, కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవేమీ పోలీసులు పట్టించుకోవద్దు అని స్పష్టంగా చెప్పారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాస్తలోతుగా అర్థం చేసుకుంటే ..ఈ వారం పది రోజుల్లో పోలీసులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడారు అనేది చూసుకుంటే రెండు సందర్భాల్లో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు.

జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే…దేశంలో పోలీసులు హక్కులను ఉల్లంఘించేలా ప్రవర్తిస్తున్నారు. మానవహక్కుల ఉల్లంఘనలకు కూడా పాల్పడుతున్నారు. పోలీసు స్టేషన్ లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అంటూ ఆక్షేపణ వ్యక్తం చేశారు. అంతకు ముందు కేసుల దర్యాప్తులో సీబీఐ, ఈడీ న్యాయవ్యవస్థ చెప్పినట్లు పని చేయడం లేదు, కోర్టు సూచనలు పాటించడం లేదు, ఇటువంటి వ్యవస్థలు ఉండటం వల్ల న్యాయ వ్యవస్థకు పెను ప్రమాదం ఉంది. అలాగే ఎదైనా విచారణ చేయమన్నా, చార్జిషీటు దాఖలు చేయాలన్నా నెలలు తరబడి, సంవత్సరాల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఒక చార్జిషీటు దాఖలు చేయడానికి 15 నెలలు, 18 నెలలు గడువు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో..వారి పని తీరు మారాలి అంటూ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క సీబీఐ, ఈడీలతో పాటు పోలీసుల పనితీరు పట్ల కూడా జస్టిస్ రమణ ఆక్షేపణలు వ్యక్తం చేయడం తెలిసిందే.

నిన్న అమిత్ మాట్లాడుతూ మానవహక్కులు కాపాడాలంటే పోలీసులు ఉండాలి. కొన్ని అవాంఛనీయ సంఘటనలను సాకుగా తీసుకుని పోలీసులను కించపరిచేలా, పోలీసు వ్యవస్థను అస్తిపరిచేలా కొంత మంది మాట్లాడుతున్నారు, కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, వాటిని సహించకూడదు, పట్టించుకోకూడదు అని ఆయన చెప్పారు. ఎన్వీ రమణ కామెంట్స్ చూస్తే అలా ఉన్నాయి అమిత్ షా కామెంట్స్ చూస్తే ఇలా ఉన్నాయి. పరస్పరం విభిన్నంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవి చూస్తుంటే ఏదో జరగబోతుంది అన్నట్లుగా ఉంది. మానవహక్కుల విషయానికే వస్తే..అమిత్ షా చెప్పింది జరుగుతుందా, లేక ఎన్వీ రమణ చెప్పింది జరుగుతుందా అనేది చూద్దాం.

ఉదాహారణకు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులను గమనిస్తే తెలంగాణలో తీన్ మార్ మల్లన్నను అరెస్టు చేశారు. వారం రోజులు అవుతుంది. ఏ కేసులో అరెస్టు చేశారు అనేది చూసుకుంటే ఎప్పుడో ఏప్రిల్ నెలలో లక్ష్మీకాంత్ శర్మ అనే జోతిష్యపండితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఇటీవల అరెస్టు చేశారు. ఎవరు చెబితే అరెస్టు చేశారు అంటే ఒ సభలో మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఇక ఏపి విషయానికి వస్తే ప్రతిపక్షాలకు హక్కులు ఉన్నాయా అన్న అనుమానం రాకమానదు. ఎందుకంటే వారు ప్రజా సమస్యలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నా, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా పోలీసులు అనుమతులు ఇవ్వకపోగా ఆ నిరసనలో ఉన్న వారిని తీసుకువెళ్లి అరెస్టు చేస్తున్నారు. ఏదో ఒక కేసు పెడుతున్నారు. ఏది లేకపోతే కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు పెడుతున్నారు. అదే సందర్భంలో రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్న వైసీపీ వాళ్లపై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన కేసులు ఎందుకు పెట్టడం లేదు.

ఇటీవల దివంగత సీఎం వైఎస్ఆర్ వర్థంతి జరిగింది. ఈ కార్యక్రమాల్లో వందలాది మంది కార్యకర్తలు, నాయకులు హజరైయ్యారు. అక్కడ కూడా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘనలు ఉంటాయి కదా అక్కడ వర్తించనిది పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనకు జనాలను పోగేసి ధర్నాలు చేస్తే కోవిడ్ నిబంధనలు అంటూ ఎందుకు గుర్తుకు వస్తున్నట్లు ఆలోచించాలి కదా. ఇవి హక్కులు కాలరాస్తున్నాట్లా ? కాదా?.  స్వేచ్చను హరిస్తున్నట్లా ? లేదా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి పోలీసులు అనుకూలంగా పని చేస్తుంటారు. అది సహజం కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మరీ ఎక్కువగా చేస్తున్నట్లు కనబడుతోంది.

ఇటీవల  జరిగిన  టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉదంతం అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన విశాఖ జిల్లాలో ఓ వేడుకకు వెళితే అక్కడ అదుపులోకి తీసుకుని తరలించారు. ఇది మానవ హక్కులు ఉల్లంఘన జరిగినట్లేగా ?, స్వేచ్చను హరించినట్లే కదా?. ఇవన్నీ చూస్తుంటే అమిత్ షా చెప్పినట్లు క్షేత్రస్థాయిలో జరగడం లేదు. జస్టిస్ ఎన్వీ రమణ చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవాలు. కాకపోతే కేంద్ర హోంమంత్రి స్థాయిలో అమిత్ షా ఆ మాటలు చెప్పారు అంటే ఎన్వీ రమణ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించినట్లే అవుతుంది. ఇవి ఇక్కడతో ఆగుతుందా. ఆ వ్యవస్థ నుండి గానీ ఈ వ్యవస్థ నుండి ఇంకా ఏమైనా కామెంట్స్ వస్తాయా, సంచలనానికి దారి తీయబోతున్నాయా అనేది ఆసక్తికరంగా మారుతోంది.


Share

Related posts

Tamilanadu Elections : శృతి హాసన్ పై బీజేపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

bharani jella

Eatela Rajendar: ష‌ర్మిల పార్టీలోకి ఈట‌ల‌.. ఇంత‌కంటే దౌర్భాగ్యం ఏముంటుంది?

sridhar

సంక్షేమం అనంతరం జగన్ స్టెప్ రెడీ!

CMR