NewsOrbit
జాతీయం న్యూస్

Omicron Variant: డెల్టా కంటే ఒమైక్రాన్ ప్రమాదకరమైందా…? నిపుణులు ఏమంటున్నారంటే..?

Omicron Variant:  దక్షిణాఫ్రికాలో గత వారం వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వేరియంట్ 13 దేశాలలో విస్తరించింది. కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో వివిధ దేశాలు అప్రమత్తమైయ్యాయి. ఇప్పటికే ట్రావెల్ బ్యాన్, ఆర్ టీ పీసీఆర్ టెస్ట్, క్వారంటైన్ తదితర ఆంక్షలు విధిస్తున్నాయి. ఒమెక్రాన్ పై ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో డబ్ల్యుహెచ్ఓ దీని గురించి తాజా ఫలితాలను వెల్లడించింది. గతంలో కోవిడ్ 19 బారిన పడిన వ్యక్తులకు కొత్త వేరియంట్ తో సులభంగా వైరస్ సోకే ప్రమాదం ఉందని ప్రాధమిక ఆధారాలు సూచిస్తున్నట్లు తెలిపింది. డెల్టా ఇతర వేరియంట్లతో పోలిస్తే వేగంగా వ్యాప్తి చెందుతున్నదా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని వెల్లడించింది. ప్రస్తుతానికైతే ఆర్టీ పీసీఆర్ పరీక్షల ద్వారా కొత్త వేరియంట్ ను గుర్తించవచ్చని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లు కొత్త వేరియంట్ ఒమైక్రాన్ పై ఏ మేరకు పని చేస్తాయి అనేదానిపై డబ్ల్యుహెచ్ఓ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఒమైక్రాన్ ద్వారా వ్యాధి తీవ్రత పెరుగుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమైక్రాన్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రాధమికంగా సమాచారం అందుతోందని తెలిపింది. ఓమైక్రాన్ పరివర్తన తీరు స్పష్టంగా తెలియడానికి కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్ఓ పేర్కొన్నది.

Omicron Variant updates
Omicron Variant updates

Omicron Variant: డెల్టా వేరియంట్ కంటే తక్కువ ప్రాణాంతకమైనది

అయితే ఇక్కడ ఊరట నిచ్చే అంశం ఏమిటంటే డెల్టా వేరియంట్ కంటే ఒమైక్రాన్ తక్కువ ప్రాణాంతకమైనదట. ఈ విషయాన్ని జోహెన్స్ బర్గ్ వైద్య నిపుణులు వెల్లడించారు. జోహెన్ బర్గ్ ప్రాంతంలో కోవిడ్ బారిన పడిన వారిలో 90 శాతం మంది ఒమైక్రాన్ వేరియంట్ బాధితులే. అయితే ఈ వేరియంట్ వల్ల మరణించే వారి సంఖ్య తక్కువగానే ఉందని అక్కడి మీడియా నివేదించింది. ఈ వేరియంట్ బారిన పడిన వారిలో అంతుబట్టని లక్షణాలు కనబడుతున్నప్పటికీ వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటోందని తెలుస్తోంది. కొత్త వేరియంట్ సోకిన వ్యక్తుల్లో వికారం, తలనొప్పి, అలసట, అధిక పల్స్ రేటు ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వేరియంట్ వల్ల ఎవరూ రుచి లేదా వాసన కోల్పోలేదని సమాచారం. ఒమైక్రాన్ సోకిన రోగులకు కేవలం తీవ్రమైన తలనొప్పి, వికారం, లేదా మైకం ఉన్నట్లు దక్షిణాఫ్రికా లోని ఎక్కువ మంది వైద్యులు దృవీకరించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!