NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Omicron variant: ఒమైక్రాన్ వేరియంట్ పై కీలక విషయాన్ని వెల్లడించిన డబ్ల్యుహెచ్ఒ అధికార ప్రతినిధి..!!

Omicron variant: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఊరట నిచ్చే అంశం వెల్లడించింది. ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకలకు పరీక్షలు నిర్వహిస్తూ కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని ఆసుపత్రికి, క్వారంటైన్ లకు తరలిస్తున్నారు. పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. మన దేశంలోని కర్ణాటకలో రెండు కేసులు వెలుగు చూశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.

Omicron variant WHO statment
Omicron variant WHO statment

Omicron variant: మరణాలు నమోదు కాలేదు

ఈ తరుణంలో ఒమైక్రాన్ వేరియంట్ తో ఇప్పటి వరకూ ఎవరూ చనిపోలేదని డబ్ల్యుహెచ్ఒ వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ కు సంబంధించి ప్రపంచ దేశాల నుండి విస్తృత స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారమని జేనీవాలోని డబ్ల్యుహెచ్ఒ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మాయర్ తెలిపారు. ఒమైక్రాన్ విస్తృతంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అత్యధిక టెస్టులు నిర్వహిస్తుండటం వల్ల మరిన్ని కేసులు గుర్తించగలమనీ, మరింత సమాచారాన్ని తెలుసుకోగలమని చెప్పారు. ప్రస్తుతం ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకూ అత్యంత ప్రభావం చూపిన వేరియంట్ గా డెల్టా వేరియంట్ గురించే చెబుతామని లిండ్మీయార్ అన్నారు. ఒమైక్రాన్ తీవ్రత ఏ మేరకు ఉంటుంది అన్న అంశంపై ప్రకటన చేసేందుకు మరి కొన్ని వారాల సమయం పడుతుందన్నారు. ఒమైక్రాన్ సంక్రమణ వేగం, వ్యాధి లక్షణాల తీవ్రత, దీనిపై వ్యాక్సిన్ల పని తీరు, చికిత్సకు స్పందించే తీరును ఇప్పట్లో చెప్పలేమనీ, ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని లిండ్మీయర్ స్పష్టం చేశారు.

ఎయిర్ పోర్టుల్లో విస్తృతంగా పరీక్షలు

కాగా ఒమైక్రాన్ అలజడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విదేశాల నుండి వచ్చే ప్రయాణీలపై నిఘా కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఇతర దేశం నుండి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఖుతుబుల్లాపూర్ కు చెందిన ప్రయాణీకురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా పరారు అవ్వడం తీవ్ర కలకలాన్ని రేపింది. వెంటనే అధికారులు అప్రమత్తమై పాస్ పోర్టు పై ఉన్న అడ్రస్ అధారంగా ఆమె వెళ్లిన ఆపార్ట్ మెంట్ వెళ్లారు. అధికారులను చూసి అక్కడ నుండి ఎస్కేప్ కావడానికి ప్రయత్నించిన ఆమెను అధికారులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju