అస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌‌కు యూకే అనుమతి

Share

 

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, అస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ను ప్రపంచంలోనే మొట్టమొదట ఆమోదించిన దేశంగా బ్రిటన్ నిలిచింది. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్‌ వ్యాప్తితో ఆందోళన చెందుతున్న యుకే ప్రభుత్వం నేడు అస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగం కింద అనుమతులు మంజూరు చేసింది. వచ్చే వారం ఈ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఫైజర్ తరువాత యూకేలో అనుమతి లభించిన రెండో వ్యాక్సిన్ ఇదే.

 

ప్రపంచంలో ఇప్పటి వరకూ అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లలో అస్ట్రాజెనెకా మూడవది. ఇంతకు ముందు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌ లకు యూఎస్ ఎఫ్‌డీఏ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ఈ నెల మొదటి వారంలో యూకే ప్రభుత్వం ఫైజర్ – బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ను ఆమోదించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ యూకె లో ఆరు లక్షలకుపైగా మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే ఇటీవల అక్కడ కొత్త రకం కరోనా బయటపడి వేగంగా వ్యాప్తి చెందుతున్నది. సోమవారం ఒక్కరోజే దాదాపు 20వేలకుపైగా స్ట్రెయిన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆసుపత్రులు అన్ని కోవిడ్ పేషంట్స్‌తో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం రెండవ వ్యాక్సిన్ కు అత్యవసరంగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే వంద మిలియిన్ అస్ట్రాజెనెకా డోసులను ఆర్డర్ చేసింది.

కాగా యూకే లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కు అనుమతులు రావడంతో భారతదేశంలో వ్యాక్సిన్ విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇండియాలోనూ త్వరలోనే కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అస్ట్రాజెనెకా టీకావైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఫైజర్ టీకాతో పోలిస్తే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ధర తక్కువగా ఉండటంతో పాటు భద్రపర్చడం కూడా సులువుగా ఉండటంతో ఈ టీకా వినియోగంపై పరిశీలనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.

 


Share

Related posts

‘రూ.11కోట్ల వృధా ఖర్చు ఎందుకో?’

somaraju sharma

అవును.. ఆమెకు అవమానం జరిగింది ! ఎవరికి ? ఎక్కడ ?

Yandamuri

Shyam singh roy : శ్యామ్ సింగరాయ్ ఫైనల్ షెడ్యూల్ లో నాని

GRK