NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Pearls Harvest: ముత్యాల సాగుతో లక్షలు ఆర్జించవచ్చు..! అదెలా అంటే..!!

Pearls Harvest: మనకు పకృతి ప్రసాదించిన నవరత్నాలలో ఒకటి ముత్యం అన్నది ప్రతి ఒక్కరికీ తెలుసు. ముత్యపు చిప్పలల నుండి  ఈ ముత్యాలు తయారవుతాయి. మహిళలు తమ ఆభరణాలలో ముత్యాలను అలంకరణకు వాడతారు. ముత్యాల ఆభరణాలను ఎక్కువ మంది ఇష్టపడతారు. చైనా, జపాన్, మయన్మార్ దేశాలలో ముత్యాల సాగు పెద్ద వ్యాపారంగా నడుస్తుంది. సాధారణంగా ముత్యాలు నదులు, సముద్రాలు, చెరువుల్లో దొరికుతాయని తెలుసు కానీ కేరళలోని ఓ రైతు తన పెరట్లోనే ముత్యాల సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. తన ఇంట్లోనే ముత్యాల సాగు చేస్తూ ఆయన మంచి పేరు గణించాడు.

Pearls Harvest: how to start Pearl farming in small area
Pearls Harvest how to start Pearl farming in small area

కేరళకు చెందిన మతాచన్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఉన్నత చదువులు పూర్తి చేసి సౌదీ అరేబియాలోని ధారన్ లోగ కింగ్ ఫాధ్ పెట్రోలియం అండ్ మినిరల్ యూనివర్శిటీలో టెలికమ్యూనికేషన్ లో ప్రొఫెసర్ గా పని చేశారు. ఆ సమయంలో యూనివర్శిటీ పని మీద చైనాకు వెళ్లాల్సి వచ్చింది. చైనాలోని ధనుష్షీ ఫిషరీస్ రీసర్చి సెంటర్ లో పలు కోర్సులు నేర్చుకోవాలన్న ఆసక్తితో ఆయన ముత్యాల సాగులో డిప్లొమా కోర్సు పూర్తి చేశాడు. ఈ తరహ విద్య ఒకటి ఉందని మన దేశంలో చాలా మందికి తెలియదు. భారత్ లో కొద్ది మంది మాత్రమే ఈ కోర్సు చదివారు.

మతాచర్ ఈ కోర్సు పూర్తి చేసిన తరువాత తన ఫ్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 1999లో తిరిగి కేరళకు చేరుకున్నారు. తన ఇంటి పెరట్లోనే ముత్యాల సాగు మొదలు పెట్టారు. నదులలో దొరికే ఆల్చిప్పలను తీసుకువచ్చి వాటిని 18 నెలలు బకెట్లో ఉంటి ముత్యాలను ఉత్పత్తి చేశారు. 18 నెలల కాలంలో 50 బక్కెట్ల ద్వారా ముత్యాలను ఉత్పత్తి చేయడం ద్వారా అతను రూ.4.50 లక్షలు ఆదాయంగా పొందాడు. గత రెండు దశాబ్దాలుగా మతాచన్ ముత్యాల సాగే చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన ముత్యాలను ఎక్కువ భాగం ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, కువైట్, స్విట్జర్లాండ్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ముత్యాల సాగు కోసం మతాచన్ మొదట పెట్టుబడి లక్షన్నర మాత్రమే కాగా తను అందుకున్న లాభం మూడు లక్షలు. తొలి లాభంతో ఇక మతాచన్ వెనుతిరిగి చూడకుండా వ్యాపారాన్ని కొనసాగించి లక్షలు ఆర్జించాడు. తొలి నాళ్లలో మతాచన్ చేస్తున్న పని చేసిన పలువురు అవహేళన కూడా చేశారు. అయినా తను అదే పని కొనసాగిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

Read More: Job alert: క్రీడాకారులకు ఐటీ శాఖలో సువర్ణ అవకాశాలు..! ధరఖాస్తు చేసుకోవడం ఇలా..!!

ఈ వ్యాపారం ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చని తెలుసుకోవడంతో ఎక్కువ మంది యువత దీనిపై ఆశక్తి చూపుతున్నారు. దీంతో మతాచన్ స్థానిక నిరుద్యోగ యువతకు ముత్యాల సాగుపై ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు రూ.10వేలు ఫీజుగా తీసుకుంటున్నారు. మంచినీటి సరస్సుల వద్ద లభించే ముత్యపు చిప్పలతో ముత్యాల సాగు చేస్తే అధిక లాభాలను ఆర్జించవచ్చని యువతకు ఆయన సూచన చేశారు.

author avatar
bharani jella

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju