టాటా సన్స్ మాజీ చైర్మన్, ప్రస్తుత షాపూర్ జీ – పల్గొంజీ గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అహ్మదాబాద్ నుండి ముంబాయికి మిస్త్రీ కారులో వెళుతుండగా మహారాష్ట్ర లోని పాల్టర్ జిల్లా లో సూర్య నది వంతెనపై కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న సైరస్ మిస్త్రీతో పాటు మరొకరు మృతి చెందగా , మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు వేగంగా వస్తూ రాంగ్ రూట్ లో ఎదురుగా వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదానికి గురైందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. అయితే ఈ ఘటన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటి సీఎం దేవేంద్ర పడ్నవీస్ తెలిపారు.
Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..
1968 జూలై 4న జన్మించిన సైరస్ మిస్త్రీ రతన్ టాటాతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత పల్గోంజీ గ్రూపు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు భార్య రోహికా, ఇద్దరు కుమారులు ఉన్నారు. మిస్త్రీ అకాల మరణంపై పలువురు రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు దిగ్భాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మిస్త్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిస్త్రీ మృతి పట్ల టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు.
తప్పులు ఎక్కువ కాలం చేయలేరు .. ఎప్పటికైనా వెలుగు చూడక మానవు.. ఇదే ఉదాహరణ
సైరస్ మిస్త్రీ అకాల మరణం షాక్ కి గురి చేసిందని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. భారతదేశ ఆర్ధిక పరాక్రమాన్ని విశ్వసించే మంచి బిజినెస్ లీడర్ గా అభివర్ణించిన మోడీ.. ఆయన మరణం వ్యాపార పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటని అన్నారు. మిస్త్రీ కుటుంబం, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాననీ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్నరీ, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిండే, డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, వ్యాపార రంగ ప్రముఖులు హర్షా గోయెంకా తదితరులు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేశారు.