NewsOrbit
జాతీయం న్యూస్

PM Modi: పేద వర్గాలకు గుడ్ న్యూస్ అందించిన ప్రధాన మంత్రి మోడీ.. మేటర్ ఏమిటంటే..?

PM Modi: కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని (పీఎంజికేఏవై) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కార్డుదారులకు అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పథకం ఈ నెలాఖరుతో ముగియనుండగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ పథకాన్ని సెప్టెంబర్ వరకూ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు.

PM Modi announced free ration extended up to September 2022
PM Modi announced free ration extended up to September 2022

Read More: CM YS Jagan: ఏపి కేబినెట్ విస్తరణకు మూహూర్తం ఫిక్స్..ఎప్పుడంటే..?

PM Modi: సెప్టెంబర్ నెల వరకూ ఉచిత రేషన్ బియ్యం

ఉచిత రేషన్ పథకాన్ని తొలుత 2020 ఏప్రిల్ నెల నుండి జూన్ వరకూ అమలు చేశారు. తర్వాత దీన్ని నవంబర్ 2020 వరకూ పొడిగించారు. ఆ తరువాత ఈ స్కీమ్ ను 2021 మార్చి వరకూ పొడిగిస్తున్నట్లు నాడు కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి అధికారికంగా ఉత్తర్వులు రాకపోవడంతో నవంబర్ 2020తో నిలుపుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 మే నెల నుండి నవంబర్ వరకూ మరో సారి కార్డుదారుల్లో సభ్యుడికి అయిదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. తరువాత మరల ఈ ఏడాది మార్చి వరకూ కేంద్రం పొడిగించింది. ఈ నెలతో ఉచిత రేషన్ పంపిణీ ముగియనున్న నేపథ్యంలో నేటి కేంద్ర కేబినెట్ లో మరో ఆరు నెలల పాటు పొడిగించే విధంగా చర్యలు చేపట్టారు.

ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ సుమారు రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేసింది. వచ్చే ఆరు నెలల్లో మరో రూ.80వేల కోట్లు ఖర్చు చేయనున్నది. దీంతో పీఎం జీకేఏవై కింద మొత్తం వ్యయం దాదాపు రూ.3.40 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఒక ప్రకటనలో కేంద్రం తెలిపింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju