29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

కరోనా ఉదృతిపై ప్రధాని మోడీ సమీక్ష .. కీలక సూచనలు ఇవి

Share

చైనా సహా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన నిన్న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వేరియంట్ల ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. చైనాలో కరోనా వేగంగా ఉదృతికి కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్ – 7 కేసులు భారత్ లోనూ వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తొంది.

PM Modi

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ, హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక సూచనలు జారీ చేశారు. కరోనా ముప్పు తొలగిపోలేదనీ, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రదాని మోడీ సూచనలు ఇవి

  • రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు పెంచాలి
  • కరోనా కేసుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలి
  • ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు పెంచాలి
  • అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ లు ఏర్పాటు చేయాలి
  • ఆసుపత్రుల్లో బెడ్ లు, మందులు, వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలి
  • ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలి
  • రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలి

బీజేపీకి దగ్గర అయ్యేందుకే చంద్రబాబు ఖమ్మం పర్యటన .. అటు తెలంగాణ, ఇటు ఏపీ అధికార పక్ష నేతల విమర్శలు


Share

Related posts

బాబు ఆర్కే పక్కకెళ్లి ఆడుకో! నీ రాతలు తమ్ముళ్ళకే రోత పుట్టిస్తున్నాయి!

Comrade CHE

అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇవ్వబోయే తొలి స్పీచ్ వెనుక ఉన్న భారత సంతతి వ్యక్తి..!

arun kanna

Angry: ప్రతి విషయానికి కోపం వస్తుందా ? ఇలా ఆలోచించి చూడండి!!

siddhu