NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: జగన్‌కు షాక్ ఇచ్చేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ..! ఏపిలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..!!

PM Modi: విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాభోదన జరిగితేనే వారు ఉన్నతంగా రాణిస్తారనేది ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భావన. ఆ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించి రాష్ట్రంలోని ప్రభుత్వ  పాఠశాలలు అన్నింటినీ ఇంగ్లీషు మీడియం పాఠశాలలుగా మార్చేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను పూర్తిగా ఎత్తివేయడంపై తెలుగు భాషాభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ప్రాధమిక స్థాయిలో మాతృభాషపై పట్టు ఉండాలనేది తెలుగు భాషాభిమానుల వాదన. ఓ పక్క రాష్ట్రంలోని పాఠశాలల్లో  తెలుగు మాథ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేలా సీఎం జగన్ అడుగులు వేస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృభాషకు ఊతం ఇచ్చేలా నూతన విద్యావిద్యానాన్ని ప్రకటించారు. దేశంలో ఇంజనీరింగ్ విద్యను తెలుగుతో పాటు అయిదు ప్రాంతీయ భాషల్లోనూ భోదించేలా సరికొత్తగా చర్యలు చేపట్టినట్లు ప్రధాని మోదీ గురువార ప్రకటించారు. గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ ప్రాంతీయ భాషల ప్రాధాన్యత, ఆ భాషల్లో విద్యాబోధన ప్రాముఖ్యతను గురించి వివరించారు.

PM Modi engineering will teach in five local languages along Telegu
PM Modi engineering will teach in five local languages along Telegu

Read More: AP BJP Protests: ఏపిలో బీజేపీకి ఆందోళన అస్త్రాలను ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

దేశంలో పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత చేరువ చేయడంతో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి మోడి తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యాబోధన అయిదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం ఆనందంగా ఉందని ఆయన ప్రకటించారు. నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధాన మంత్రి మోడి దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యాబోధన ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్ ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!