NewsOrbit
జాతీయం న్యూస్

CBI: సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక కసరత్తు ..! ఈ ముగ్గురిలో కొత్తబాస్ ఎవరవుతారో.. ?

CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదుపరి చీఫ్ ఎంపిక ప్రక్రియకు కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు ప్రారంభం అయ్యింది. ప్రధాన మంత్రి మోడీ నివాసంలో నిన్నరాత్రి ఉన్నత స్థాయి కమిటీ భేటీ అయ్యంది. ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, లోక్ సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అథిర్ రంజన్ చౌధురి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

pm modi led panel meets to decide next CBI chief
pm modi led panel meets to decide next CBI chief

సీబీఐ కొత్త డైరెక్టర్ పదవికి 1984 -87 బ్యాచ్ లకు చెందిన 109 మందికి అధికారుల పేర్లను ఈ ఉన్నత స్థాయి కమిటీ పరిగణలోకి తీసుకొంది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ ఉన్నత స్థాయి ప్యానల్ సమావేశంలో  ముగ్గురు అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్ అవస్తీ, ఎస్ఎస్‌బీ డీజీ కేఆర్ చంద్ర, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) వీఎస్‌కే కౌముది పేర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ అంశంపై చర్చించేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని అధిర్ రంజన్ ఛౌదురి ఎంపిక తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Read more: MP RRR Case: రఘురామ కేసులో కొత్త ట్విస్ట్‌లు ఇవీ..!!

ఈ పదవికి ఎంపికైన అధికారి రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్ గా కొనసాగుతారు. ఇంతకు ముందు సీబీఐ డైరెక్టర్ గా పూర్తి కాలం పని చేసిన ఆర్‌కే శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రిటైర్ అయ్యారు. నాలుగు నెలలకు ముందుగానే ఈ కమిటీ సమావేశమై సీబీఐ కొత్త చీఫ్ ను ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఆ శాఖలో సీనియర్ అధికారి, సంయుక్త డైరెక్టర్ గా ఉన్న ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. సీబీఐ డైరెక్టర్ ఎంపికలో సీనియారిటీతో పాటు అవినీతి కేసులో విచారణ అనుభవం, నిజాయితీ, నిబద్ధత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju