29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ గతంలో చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తొందన్న ప్రధాని మోడీ

Share

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపశ్ర కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. లోక్ సభలో బుధవారం విపక్షాలను ఏకిపారేసిన ప్రధాని మోడీ .. గురువారం కూడా రాజ్యసభలో విరుచుకుపడ్డారు. గతంలో చేసిన పాపాలకు కాంగ్రెస్ శిక్ష అనుభవిస్తొందని విమర్శించారు. బీజేపీ తన పాలన ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో జనం డబ్బు మధ్యవర్తులకు చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన అంతా శుద్ద దండగ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

PM Modi Speech In Rajyasabha

 

కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని మోడీ గుర్తు చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 50 సార్లకు పైగా ఆర్టికల్ 356 ను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాలను పడగొట్టారని మోడీ విమర్శించారు. టీడీపీ అధినేత, నాటి ఏపి సీఎం నందమూరి తారక రామారావు చికిత్స కోసం అమెరికా వెళ్లే ఆయన ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ పడగొట్టారని మోడీ గుర్తు చేశారు. తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంజీఆర్ వంటి ప్రముఖుల ప్రభుత్వాలను కూడా కాంగ్రెస్ పడగొట్టిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు.  ప్రతిపక్షాలు ఎంత ఎక్కువ బురద జల్లితే కమలం అంత గొప్పగా వికసిస్తుందని అన్నారు.

కొందరి భాష, ప్రవర్తన భారతదేశానికి నిరాశ కలిగిస్తున్నాయని అన్నారు. తన పైనా, తన ప్రభుత్వంపైనా ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల వద్ద బురద ఉందనీ, తన వద్ద గులాల్ ఉందనీ, ఎవరి దగ్గర ఏది ఉంటే దానినే వారు విసురుతారని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలన సాగించిన ఆరు దశాబ్దాల కాలంలో మన దేశం నష్టపోయిందని అవేదన వ్యక్తం చేస్తూ అదే సమయంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయని అన్నారు. మరో వైపు మోడీ ప్రసంగానికి ముందు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆదానీ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశాయి. దీంతో విపక్ష సభ్యుల నిరసన మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు.

అమరావతి అంశంపై చంద్రబాబు వర్సెస్ సజ్జల హాట్ కామెంట్స్ ఇలా..


Share

Related posts

Allu Arjun: గోవా వెళ్తున్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..??

sekhar

గుడ్ న్యూస్: ఆగష్టు 1 నుంచి తగ్గనున్న బైక్, కార్లు ధరలు..

Muraliak

Allu Arjun : “బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ” సాంగ్ కి అరుదైన అవార్డు..!!

sekhar