PM Modi: ఈశాన్య రాష్ట్రాలలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడీ నేడు అక్కడి పరిస్థితులను సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్ పద్ధతిలో మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి మోడీ మాట్లాడనున్నారు. ఇటీవల ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ ఒకటికి మించి ఉండటం ఆందోళనకరమని చెన్నై లోని ఇన్ స్టిట్యూచ్ ఆఫ్ మేథమేటికల్ సైన్స్‌స్ పరిశోధన బృందం తెలిపింది.

ఆర్ ఫ్యాక్టర్ 1 దాటితేనే కరోనా మరింత ఉధృతం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరికలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగ పర్యాటక ప్రాంతాలు, అథ్యాత్మిక ప్రదేశాల్లో జన సమూహాలు దర్శనమిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ పూర్తిగా తొలగిపోలేదనీ ప్రజలంతా కోవిడ్ నియమాలు తప్పక పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తున్నా భౌతిక దూరం పాటిస్తున్న దాఖలాలు ఎక్కడా కనబడటం లేదు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలను పూర్తిగా సడలించారు.
Read More: BJP: బీజేపీ జాతీయ కమిటీలో భారీ మార్పులకు కసరత్తు..! అయిదు రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యం..!!