PM Modi: వారణాసిలో 1500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ప్రదాని మోడీ

Share

PM Modi:   ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యూపిలోని వారణాసిలో గురువారం పర్యటించారు. మోడి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో రూ.1500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. తొలుత రాష్ట్ర గవర్నర్ అనందిన్ పటేల్, సీఎం యోగి అదిత్యనాథ్ లు మోడీకి స్వాగతం పలికారు. అనంతరం రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో  పాటు రూ.839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా జపాన్ సహకారంత నిర్మించిన ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్ష్ ను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోడీ యోగి ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. చాలా రోజుల తరువాత వారణాసి ప్రజలను కలుసుకునే అదృష్టం వచ్చిందన్న మోడీ కాశిలో జరుగుతున్న అభివృద్ధి అంతా కాశీ విశ్వేశ్వరుడి ఆశీర్వాదంతోనే జరుగుతోందన్నారు.

PM Modi Varanasi tour
PM Modi Varanasi tour

యూపీలోనే కరోనా పరీక్షలు అత్యధికంగా జరిగాయనీ, వ్యాక్సినేషన్ కూడా ఎక్కువ మోతాదులో ఇక్కడే జరిగిందని పేర్కొన్నారు. గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయనీ, కరోనా కారణంగా యూపీ, వారణాసిలోనూ ప్రమాద ఘంటికలు మోగాయన్నారు. అయినా కాశీ అలసిపోలేదని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ను యూపీ ప్రభుత్వం పూర్తి సమర్థతతో ఎదుర్కొందని మోడీ ప్రశంసించారు. పూర్వాంచల్ ప్రాంతాలన్నింటిలో కెల్లా కాశీ ఓ మోడికల్ హబ్ గా ఏర్పడిందని అన్నారు. మెడికల్ కాలేజీల సంఖ్య కూడా పెరిగిందనీ, యూపి అంతా ఆక్సిజన్ ప్లాంట్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఒక్క వారణాసిలోనే 14 ప్లాంట్లను నెలకొల్పామని మోడీ వివరించారు.

యూపిలో యోగి పాలనను ప్రశంసిస్తూ మాఫియా, గుండా రాజ్యాన్ని యోగి అంతం చేశారన్నారు.  ఆడపిల్లల వైపు కన్నెత్తి చూసే వారికి కఠినమైన శిక్షలుంటాయన్న విషయం అర్ధమైపోయిందనీ, ఇవన్నీ లేకుండా యూపీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని మోడీ కితాబు ఇచ్చారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మోడీ పర్యటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


Share

Related posts

కూలిందా ? కూల్చేశారా?

somaraju sharma

బ్రేకింగ్: అలా చేస్తే వైసీపీలో చేరడానికి రెడీ – జేసీ ప్రభాకర్ రెడ్డి

Vihari

కొడాలి నాని ఏకు మేకు అవుతున్నాడా?

sridhar