NewsOrbit
Featured జాతీయం ట్రెండింగ్ న్యూస్

16నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ. తొలి రోజు ఎంత మందికో తెలుసా

ఈ నెల 16వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 16వ తేదీన వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిర్దేశించిన కేంద్రాలకు వ్యాక్సిన్ రవాణా జరుగుతున్నది. తొలి దశలో భాగంగా కోటి మందికి వ్యాక్సిన్ లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమై 1.65 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సేకరించింది. వీటిలో 1.1 కోట్ల డోసులు కోవిషీల్డ్ వి కాగా, మరో 55 లక్షల డోసులను భారత్ బయోటెక్ (కోవాగ్జిన్ ) నుండి తీసుకుంది.

PM Narendra Modi to launch COVID 19 vaccination drive on January 16

కాగా జనవరి 16న తొలి రోజు దాదాపు 3 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2934 కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ లను అందించనున్నారు. ప్రతి కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రంలోనూ వ్యాక్సిన్ సంఖ్య కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలని, అవసరమైన వాటికంటే పది శాతం (రిజర్వు, వేస్టేజ్) డోసులు అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను రాష్ట్రాలు పెంచుకుంటూ వెళ్లాలని తెలిపింది.

PM Narendra Modi to launch COVID 19 vaccination drive on January 16

ఇక కరోనా టీకా ను రెండు డోసులను 28 రోజుల వ్యవధిలో ఇస్తారు. అయితే టీకా తీసుకున్న 14 రోజుల తరువాతే దాని ప్రభావం ప్రారంభం అవుతుందని ఇంతకు ముందే కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్న వారు కోవిడ్ నిబందనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ లు అందుబాటులోకి రాగా వీటిలో ఏ టీకా తీసుకోవాలనే అప్షన్ ప్రస్తుతానికి లబ్దిదారులకు లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N