రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వారి మతం ఏదైనా వివిధ ప్రార్ధనా మందిరాలను సందర్శించి ఆయా వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే బీజేపీకి హిందూత్వ పార్టీగా ముద్ర పడిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పార్టీ నేతలు ఎక్కువగా హిందూ దేవాలయాలనే సందర్శిస్తుంటారు. ఇతర మతాలకు చెందిన ప్రార్ధనా మందిరాలను సందర్శించడం చాలా అరుదు.

అయితే ఇప్పుడు విశేషం ఏమిటంటే .. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా నరేంద్ర మోడీ ఇవేళ క్రైస్తవుల పండుగ ఈస్టర్ ను పురస్కరించుకుని ఢిల్లీలోని సేక్రేడ్ హార్డ్ కేథాడ్రల్ చర్చిని సందర్శించారు. చర్చికి వచ్చిన క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధాని మోడీ ఈ చర్చిని సందర్శించడం ఇదే మొదటి సారి కావడంతో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. చర్చి ప్రధాన పాస్టర్ స్వామినాథన్ ప్రధాని మోడీకి ఏసుక్రీస్తు శిలువను బహుకరించారు.

ప్రధాని ఈస్టర్ సందర్భంగా చర్చికి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు స్వామినాథన్. ప్రార్ధనల అనంతరం అక్కడి వారు మోడీతో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా చర్చి ముందు ఉన్న గార్డెన్ లో మోడీ ఓ మొక్కను నాటారు, ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చర్చి నిర్వహకులు తెలిపారు. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం రోజున క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. కాగా చర్చి సందర్శించిన ఫోటోలను, వీడియోను ప్రధాని మోడీ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. వీటిపై నెటిజన్ లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Some more pictures from the Sacred Heart Cathedral, Delhi on Easter.
May this day further happiness and harmony in society. pic.twitter.com/970eHYmrAn
— Narendra Modi (@narendramodi) April 9, 2023
Easter celebrations in Delhi! pic.twitter.com/J0gz9RhhLj
— Narendra Modi (@narendramodi) April 9, 2023
బండి సంజయ్ కేసులో మరో ట్విస్ట్ .. ఫోన్ పోయిందంటూ పీఎస్ లో ఫిర్యాదు