NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Pragya Singh Thakur: మరో వివాదంలో ఆ మహిళా బీజేపీ ఎంపి..! కాంగ్రెస్ నేతలకు మళ్లీ చిక్కింది..!!

Pragya Singh Thakur: ఆ బీజేపీ మహిళా ఎంపి తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అనాలోచితంగా ఆమె చేసే చర్యలు విమర్శలకు దారి తీస్తుంటారు. అనారోగ్య కారణాన్ని చూపి కోర్టు విచారణలకు గైర్హజరు అవుతుంటారు. అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ చక్రాల కుర్చీలో కనిపించే ఆమె ఎదైనా వేడుకలు జరిగితే మహిళలతో కలిసి స్టెప్పులు వేసి ఆనందపరుస్తారు. ప్లేగ్రౌండ్ కు వెళితే క్రీడాకారులతో కలిసి ఆట ఆడి వారిని ఉత్సాహపరుస్తుంటారు. వీటిపై అక్కడి కాంగ్రెస్ నేతలు ఆమెపై సెటైర్ లు వేయడం, విమర్శలు చేయడం చేస్తుంటారు. తాజాగా ఆ ఎంపి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకు ఆ ఎంపి ఎవరు అంటే…

Pragya Singh Thakur vaccination controversy
Pragya Singh Thakur vaccination controversy

Read More: AP CM YS Jagan: గ్రామ సచివాలయాల పనితీరును మరో సారి ప్రధాని మోడీకి వివరించిన సీఎం వైఎస్ జగన్..!!

మధ్యప్రదేశ్ లోని భోపాల్ ఎంపి ప్రజ్ఞాఠాకూర్. ఇటీవల ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఈ ప్రజా ప్రతినిధి అందరిలాగా టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోలేదు. ఆరోగ్య సిబ్బంది ఎంపి గృహానికి వెళ్లి వ్యాక్సిన్ వేశారు. అయితే ఎంపి ప్రజ్ఞాఠాకూర్ ఇంటిలోనే వ్యాక్సిన్ వేయించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు అందుకుంది. దీనిపై పలువురు అడిగిన ప్రశ్నకు ఆరోగ్య సిబ్బంది వివరణ ఇచ్చారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిబంధనల మేరకు ఆమెకు తన ఇంటి వద్దే వ్యాక్సిన్ వేసినట్లు మీడియాకు ఆరోగ్య సిబ్బంది తెలిపారు.

దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సులూజా ట్విట్టర్ వేదికగా ఆమెను విమర్శించారు. ఇటీవలే బాస్కెట్ బాల్ ఆడి, డ్యాన్స్  చేసి అలరించిన మన భోపాల్ ఎంపి.. ఇప్పుడు ఆరోగ్య సిబ్బందిని ఇంటిని పిలిపించుకుని టీకా వేయించుకున్నారు. ప్రధాన మంత్రి మోడీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు బీజేపీ నేతలు అందరూ ఆసుపత్రికి వెళ్లే వ్యాక్సిన్ తీసుకున్నారు. మరి ఆమెకు ఎందుకు మినహాయింపు కల్పించారు అంటూ సలూజా ప్రశ్నించారు.

మాలేగావ్ పేలుళ్ల కేసులో బెయిల్ పై విడుదలైన ఎంపి ప్రజ్ఞాఠాకూర్ కోర్టు విచారణలకు గైర్హజరు అవుతున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా విచారణకు హజరుకాలేననీ, తనకు మినహాయింపు ఇవ్వాలని పలు మార్లు కోర్టును కోరారు. అయితే ఇటీవల ఆమె క్రీడామైదానంలో బాస్కెట్ బాల్ ఆడటం, ఓ వివాహ వేడుకలో మహిళలతో కలిసి డ్యాన్స్ స్టెప్ లు వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?