NewsOrbit
Featured జాతీయం బిగ్ స్టోరీ

Prasanth kishore : రాజకీయ రారాజు ప్రశాంత్ కిషోర్ : ఇప్పుడు గెలిస్తే ఇక తిరుగులేనట్లే!

Prasanth Kishore : ఎంతో తెలివైన బుర్ర గా, ఎత్తులు వేస్తే కచ్చితంగా ఎన్నికల్లో విజయం ఖాయం అన్న పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ కు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకం. ఎంత కీలకం అంటే ఆయన ఈ ఎన్నికల్లో కనుక విజయం సాధిస్తే, భారత దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంత బిజీగా ఉండే మనిషి మరొకరు ఉండరు. ఇటు ఆర్థికంగానూ అటు వృత్తిగతంగా ను ప్రశాంత్ కిషోర్ కు హీరో హోదా వస్తుంది అనడంలో సందేహం లేదు.

Prasanth Kishore
Prasanth Kishore

ప్రశాంత్ కిషోర్ బీహార్లోని రోహితస్ జిల్లా, కొనార్ గ్రామంలో పుట్టారు. ఆయన తండ్రి శ్రీకాంత్ పాండే ఒక వైద్యుడు. ప్రశాంత్ కిషోర్ పుట్టిన తర్వాత ఆయన బీహార్ లోని బుక్సర్ కు వెళ్లిపోయారు. తర్వాత హైదరాబాద్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆయన భార్య పేరు జాహ్నవి దాస్. ఆమె వైద్యురాలు. భారత దేశ రాజకీయాల్లో కి ప్రశాంత్ కిషోర్ రాకమునుపు పబ్లిక్ హెల్త్ మీద స్పెషలిస్ట్గా యునైటెడ్ నేషన్స్ లో కూడా పనిచేసిన కిషోర్ మొదటిసారిగా 2011 లో నరేంద్ర మోడీ కోసం గుజరాత్ లో పనిచేయడంతో తన కెరీర్ ని మొదలు పెట్టారు. 33 ఏళ్ల యువకుడు అయిన ప్రశాంత్ కిషోర్ ను నమ్మిన మోడీ, ఆయన చెబుతున్న విషయాలకు ముగ్ధులై సాంకేతికతను ఉపయోగించుకుని ఎన్నికల్లో ఓటర్లను ఎలా ప్రభావితం చేయవచ్చు అన్న విషయాన్నీ అర్థం చేసుకొని ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు.

ప్రశాంత్ కిషోర్ చాకచక్యంతో పాటు మోదీ గా ఉండటంతో 2012లో గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీని తర్వాత దేశ వ్యాప్తంగా మోడీ ప్రభావాన్ని చాటి చెప్పడంతో పాటు, ఆయన భావి ప్రధాని అని ప్రచారం కల్పించడం లో ప్రశాంత్  ఆలోచన ఎంత ఉంది. గుజరాత్ ఎన్నికల తర్వాత సిటిజన్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (కాగ్) అని సంస్థను ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఏర్పాటు చేసిన ప్రశాంత్ కిషోర్ దీనిద్వారా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీకి అనుకూలంగా ఆయన చేపట్టిన కొన్ని కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. 2014లో బిజెపి అద్భుతమైన విజయాన్ని సాధించి మోడీ ప్రధాని అయ్యారు. చాయ్ పే చర్చ, 3d ర్యాలీ, రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాలతో పాటు మోదీ టీంలో 2014కు ముందు కీలకంగా పని చేశారు.

కాగ్ ఆర్గనైజేషన్ 2015 తర్వాత ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్ ) గా మార్చి మొదటిసారి రాజకీయ వ్యూహకర్తగా బీహార్ ఎన్నికల్లో రంగంలోకి దిగారు. నితీష్ కుమార్ కోసం పనిచేసిన ఆయన బీహార్ మొత్తం తిరిగి ప్రజలకు ఏం కావాలన్నా దానిమీద సీఎం ఏడు కీలక అంశాల మీద దృష్టి పెట్టేలా “నీతిష్ కా నిచ్చాయ్.. వికాస్ కి గ్యారంటీ ” అనే స్లోగన్ ను రూపొందించి ఆయన సీఎం కావడానికి దోహదపడ్డారు. దీంతో మొదటి సారి ప్రశాంత్ కిషోర్ పేరు దేశం అంతా మారు మోగిపోయింది.

Bihar Feb 18 ANI Indian political strategist Prashant Kishor speaks to media during a press conference in Patna on Tuesday ANI photo

2017 లో పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ సేవలను కోరింది. కెప్టెన్ అమరేంద్ర సింగ్ స్వయంగా ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యి, తమకు పని చేయాల్సిందిగా కోరారు. పంజాబ్‌లో 2017లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 77 స్థానాలు సాధించిన విజయాన్ని సాధించింది. 2017లో ఉత్తరప్రదేశ్ ఫలితాల్లో ప్రశాంత్ కిషోర్ కు చేదు ఫలితం ఎదురైనప్పటికీ, 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి కు ఆయన చేసిన అద్భుతమైన క్యాంపెయిన్ ఎంతో దోహదపడింది. జగన్ మేనియా కు తోడు, ప్రశాంత్ కిషోర్ చాకచక్యం కూడా జత కలవడంతో 151 సీట్లు చిట్టి సాధించగలిగింది. 2020లో కేజ్రివాల్ తరఫున పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకు అద్భుతమైన విజయాన్ని అందించడంలో సహాయపడ్డారు.

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీం బెంగాల్లో మమతా బెనర్జీ కోసం, తమిళనాడు లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే కోసం పని చేస్తోంది. బెంగాల్లో అత్యంత బలమైన బిజెపి ని ఢీ కొట్టడానికి ప్రశాంత్ అమలు చేసిన వ్యూహాలు మమతాకు మంచి మైలేజ్ ను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా స్థానికత అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చి మమతా చేసిన ప్రసంగాలు బెంగాల్ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఇక బెంగాలీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోతే తాను వ్యూహకర్తగా పని చేయడం మానేస్తాను అని ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా సవాల్ చేయడం కూడా కీలకమే. అలాగే తమిళనాడులోనూ స్టాలిన్ ప్రభావాన్ని ఎక్కడ తగ్గనీయకుండా, మరోపక్క కీలకమైన ప్రత్యర్థులను ముందుకు వెళ్ళనీయకుండా ఆయన సాగిస్తున్న వ్యూహాలు మంచి ఫలితాలే ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ ఒపీనియన్ పోల్స్ లో బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో డిఎంకె అధికారంలోకి వస్తాయని చెప్పిన తరుణంలో ప్రశాంత్ కిషోర్ టీంకు మరింత బూస్ట్ ఇచ్చింది.

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పశ్చిమ బెంగాల్ తో పాటు తమిళంలో మంచి ఫలితాలను అందిస్తే, ఆయనకు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడుతుంది. రాజకీయ పార్టీలకు ఆయన సేవల డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే తన వ్యూహాలతో ఆర్థికంగానూ ఇటు వ్యక్తిగతంగానూ చాలా పెద్ద పేరు సంపాదించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ముందుగానే ఆయన మీద కర్చీఫ్ వేశారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తే ఇక భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకు వ్యూహకర్తగా పూర్తి స్థాయి కాల్ చెట్లు ప్రశాంత్ కిషోర్ వి బుక్ అయిపోయే అవకాశం ఉంది.

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీపై ఆ సామాజిక వర్గాలు గుస్సా .. ఎందుకంటే..?

sharma somaraju

Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఎపై వేటు ..ఎందుకంటే..?

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

TMC Vs BJP: ముద్దు రేపిన మంట .. టీఎంసీ వర్సెస్ బీజేపీ

sharma somaraju

Lok Sabha Elections 2024: రాజకీయ పార్టీలు ఇకపై ఆ నిబంధనలు పాటించాల్సిందే .. ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju