NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Presidential Election 2022: కింకర్తవ్యం..? ‘దీదీ’ ఆహ్వానంపై ‘పీకే’తో కేసిఆర్ మంతనాలు

Presidential Election 2022: ఓ వైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ ఆరంభించే అంశంతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమి చేయాలనే అంశంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరో వైపు బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డీ ఏ వ్యూహాలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్నారు. అందుకే ఓ అడుగు ముందుకు వేసి ఎన్ డీ ఏ అభ్యర్ధిని ఓడించడమే లక్ష్యంగా మమతా బెనర్జీ విపక్షాల తరపున అభ్యర్ధి ఎంపికకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీతో సహా 22 విపక్ష పార్టీల అధినేతలకు 15 ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న సమావేశానికి ఆహ్వానం పంపారు మమతా బెనర్జీ. ఇదే క్రమంలో జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కేసిఆర్ ది కీలక పాత్ర అంటూ ప్రశాంత్ కిషోర్ (పీకే) వ్యాఖ్యానించారు.

Presidential Election 2022 Mamata Banerjee KCR Strategy plans
Presidential Election 2022 Mamata Banerjee KCR Strategy plans

Presidential Election 2022: బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా కేసిఆర్

బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో నాయకత్వం చేయాలని కేసిఆర్ ఆలోచనలో ఉండగా, దీదీ మాత్రం కాంగ్రెస్ తో సహా ఇతర బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టే పని లో ఉన్నారు. ఇలా భిన్న ఆలోచనలు వీరి మధ్య ఉన్నాయి. ఈ తరుణంలో దీదీ ఆహ్వానంపై కేసిఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. రెండు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో కేసిఆర్ వరుస సమావేశాలు జరుపుతూ చర్చిస్తున్నట్లు సమాచారం. నేడు కూడా మరో సారి పీకేతో భేటీ అయి చర్చించారు కేసిఆర్. దీదీనే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన నేపథ్యంలో ఢిల్లీలో భేటీకి కేసిఆర్ వెళ్లాలనే యోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ కేసిఆర్ హజరుకాలేకపోతే కేటిఆర్ ను పంపే అవకాశం ఉందని అంటున్నారు.

 

ఏకగ్రీవానికి బీజేపి కసరత్తు

వాస్తవానికి బీజూ జనతాదళ్, వైసీపీ మద్దతు తీసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డీఏ అభ్యర్ధి విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఏకాభిప్రాయంతో రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తొంది. ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అంశంపై చర్చించారనీ, వివిధ రాజకీయ పక్షాలతో మాట్లాడే బాధ్యతలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు అప్పగించినట్లు వార్తలు వినబడుతున్నాయి. చూడాలి ఏమి జరుగుతుందో.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju