Presidential Poll: దేశం మొత్తం ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలపై దృష్టి పెట్టింది. రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ ఎవరిని ప్రకటించనుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. బీజేపీ మొదటి సారిగా ముస్లింలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటుందనీ, లేక గిరిజనుల నుండి అవకాశం ఇవ్వాలనుకుంటోందనీ, దక్షిణ భారతదేశం నుండి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అని ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే గిరిజన మహిళకు ఈ సారి అవకాశం ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం దాదాపు డిసైడ్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. చత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికీ పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఈమె ఎంఎ ఎల్ఎల్‌బీ చేశారు. గిరిజన మహిళ. సామాజిక చైతన్యం ఉంది. దేశ రాజకీయ వ్యవహారాలు, రాజ్యాంగం పైనా మంచి పట్టు ఉందని అంటున్నారు. ఈమెను తదుపరి రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలపాలని అనుకుంటున్నారుట. ఆమె కాని పక్షంలో జార్కండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మూ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈమె కూడా గిరిజన మహిళ, విద్యాధికురాలు. ఈమె సొంత రాష్ట్రం ఒడిశా.
బీజేపీ నేతలు ఏమి చేసినా ఓ లెక్క ప్రకారం చేస్తారు. సామాజిక లెక్కలు వేస్తారు, మతపరమైన లెక్కలు చూస్తారు. ఓట్ల తూకం, రాజకీయ తూకం వేస్తారు. తీసుకునే నిర్ణయానికి రాజకీయ లబ్ది చేకూరుతుందా లేదా అన్నది ప్రధానంగా చూస్తారు. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న దృష్ట్యా రాష్ట్రపతి ఎన్నికను రాబోయే ఎన్నికల్లో బీజేపీకి లాభించేలా ఉండేలా సామాజిక కోణంలో అభ్యర్ధి ఎంపికపై దృష్టి పెట్టారని భావిస్తున్నారు. ముందుగా ఏపికి చెందిన వెంకయ్యనాయుడు పేరు ప్రచారంలోకి వచ్చినా, ఆయనను రాష్ట్రపతి చేయడం వల్ల ఏపిలో బీజేపీకి లాభం ఉంటుందో లేదో కానీ టీడీపీ లాభం కల్గుతుందని ఆయన వ్యతిరేక వర్గీయులు ప్రచారం చేస్తున్నాయి.
ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే .. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలవాలంటే ఏపీలోని వైసీపీ మద్దతు అవసరం. ఎస్టీ, లేదా ముస్లిం మైనార్టీ అభ్యర్ధిని రాష్ట్రపతి బరిలోకి దింపితే వైసీపీ మద్దతు ఇస్తుంది. అదే వెంకయ్యనాయుడిని అభ్యర్ధిగా పెడితే మద్దతుపై వైసీపీ ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఎస్టీ మహిళ అయితే అందరూ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏవరైనా వ్యతిరేకిస్తే వాళ్లను గిరిజనులకు వ్యతిరేక పార్టీగా ముద్రవేయవచ్చు అన్నది బీజేపీ స్ట్రాటజీ. విపక్ష పార్టీలు ఏవీ నో చెప్పని విధంగా ఎస్సీ మహిళలైన వీరిద్దరి పేర్లను బీజేపీ తెరపైకి తీసుకువచ్చింది. ఏమి జరుగుతుందో చూడాలి.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…