Presidential Polls: రాష్ట్రపతి ఎన్నిక దగ్గర పడుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను దాదాపు ఖరారు చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. గతంలో బీజేపీలో కీలక నాయకుడుగా ఉన్న యశ్వంత్ సిన్హా 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఎంసీలో చేరారు. టీఎంసీ ఉపాధ్యక్షుడుగా ఉన్న యశ్వంత్ సిన్హా నేడు ఆ పదవికి రాజీనామా చేయడంతో ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్దిగా ఖరారు చేశారు అన్న వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది.
మరో పక్క అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎస్టీ మహిళ అయిన చత్తీస్‌ఘడ్ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికీ పేరు దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాలు ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరు దాదాపు 50 నిమిషాల సేపు వెంకయ్యతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈ సాయంత్రం భేటీ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది.
ఈ తరుణంలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపి నడ్డా లు వెంకయ్యనాయుడుతో భేటీ కావడంతో వెంకయ్యనాయుడుని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు బీజేపీ అగ్రనేతల భేటీ కోసమే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తొంది.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…