NewsOrbit
Featured జాతీయం బిగ్ స్టోరీ

BR AMBEDKAR : బాబాసాహెబ్ ను భారత నోటు మీద ఎక్కిద్దాం!

BR AMBEDKAR :  భారత లోక్ సభ లో సరికొత్త డిమాండ్.. సరికొత్త చర్చకు ఈరోజు బీజం పడింది. భారత దేశ కరెన్సీ మీద గాంధీ బొమ్మతో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని ఏకంగా లోక్ సభ సభ్యురాలు అందులోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోక్సభ సభ్యులు డిమాండ్ చేయడం ఒక కొత్త చర్చకు దారితీసింది అనే చెప్పాలి.

BR AMBEDKAR
BR AMBEDKAR

అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ లోక్ సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రాన్ని భారత దేశపు కరెన్సీ మీద ఎందుకు ముద్రించాలి అనేదాని మీద సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఇది భారతదేశపు మెరుగుపడిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ దేశంలో మహాత్మాగాంధీని ఎంతమంది పూజిస్తున్నారు ఓ బి ఆర్ అంబేద్కర్ ను అంతకంటే ఎక్కువ మంది గౌరవిస్తున్నారు అని, కొన్ని వర్గాలకు ఆయన ఒక బ్రాండ్ గా ఉన్నారు అని ఎంపీ చెప్పుకొచ్చారు.

మొదటి ప్రపంచ యుద్ద సమయంలో బ్రిటీషు పాలనలో భారతదేశం ఆర్థిక సంక్షోభానికి గురైందని, దాని నుండి బయటపడటానికి ఇంపీరియల్ బ్యాంక్ 1921ను ఏర్పాటు చేశారు. అది జరిగినప్పటికీ అది ఒక విఫల ప్రయత్నంగానే తర్వాత కాలంలో మిగిలిపోయింది. అయితే ఆ సమయంలో డా.బీఆర్ అంబేద్కర్ క్షీణిస్తున్న రూపాయి విలువను గురించి, దాని వలన సామాన్యుడి జీవనం ఎలా దుర్భరమౌతుందో, ఆర్థికంగా భారతదేశం ఎలా పతనమౌతుందో బ్రిటీషు వాళ్లకు తెలియజెప్పే పోరాటం చేసి సఫలీకృతులయ్యారు. అందుకు పరిష్కారంగా ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయాలని “హిస్టరీ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ బ్యాంకింగ్” అని ఆయన రాసిన పుస్తకం ద్వారా ‘హిల్టన్ కమిషన్’ కు సిఫారసు చేయడం జరిగింది.

బ్రిటీషు వారు ఆ బాధ్యతను సైమన్ కమిషన్ కు బదిలీ చేశారని, సైమన్ కమిషన్ 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో చర్చలు జరిపి రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయడాన్ని ఆమోదించిందని, అప్పటి కేంద్ర శాసన సభ డా. బీఆర్ అంబేద్కర్ సూచనలను క్రోడీకరించి RBI చట్టం, 1934 ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చరిత్రలో లిఖించని కారణంగా చాలామందికి దీని మీద అవగాహన ఉండకపోవచ్చు. తదనంతర కాలంలో 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయడం జరిగిందని ఎంపీ సభకు గుర్తుచేశారు.

BR AMBEDKAR
BR AMBEDKAR

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే గొప్ప ఆశయంతో మేధో మధనం చేసి రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని సంకల్పించి, అందుకు తగిన పోరాటం జరిపి సాధించిన ఆ దార్శనికుడి చిత్ర పటాన్ని ఏదైనా భారత కరెన్సీ నోటు పైన ముద్రించి, జాతిపిత మహాత్మాగాంధీ గారితో సమాన గౌరవం ఇవ్వాలని కోరుతూ, ఇప్పటికైనా అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి.

సుమారు 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించిన అనురాధ ఎన్నో కొత్త విషయాలను సభ ముందు ఉంచడంతో పాటు తాను చదువుకున్న పుస్తకాల్లో వ్యాఖ్యలను చెప్పుకొచ్చారు. కచ్చితంగా భారత దేశపు గొప్ప వ్యక్తులలో బి.ఆర్.అంబేద్కర్ ఎప్పటికీ మేటిగా మిగిలిపోతారని, ఆయన ఎన్నో నిమ్న కులాలకు మార్గదర్శిగా, మేధావులకు దార్శనికుడు గా ఉంటారని ఆయన చిత్రాన్ని భారతదేశపు అత్యున్నత కరెన్సీ మీద ముద్రించినట్లయితే ఖచ్చితంగా ఆయన గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు, ఒక గొప్ప గౌరవం ఆయనకు ఇచ్చినట్లవుతుంది

అంటూ అనురాధ చేసిన ప్రసంగానికి లోక్సభ సాక్షిగా హర్షధ్వానాలు మిన్నంటాయి. దీంతో పాటు ప్రస్తుతం సమాజంలోనూ దీనిమీద కొత్త చర్చ లేవడానికి ఆమె వ్యాఖ్యలు దారితీశాయి అన్నది, భారతదేశ చట్ట సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తాడం ద్వారా మొత్తం దేశం ఈ అంశం గురించి ఆలోచింప చేసే అవకాశం ఉంది అన్నది విశ్లేషకుల మాట. ఎంతో గొప్ప ప్రసంగం చేసిన ఆమెను సహచర ఎంపీలు అభినందనలతో ముంచెత్తారు.

author avatar
Comrade CHE

Related posts

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju