Priyanka Gandhi: సీఎం గా బరిలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ..??

Share

Priyanka Gandhi: దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ బిజెపి పార్టీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ సింగ్ సీఎంగా రాణిస్తున్నారు. ప్రధాన పార్టీలు సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ వాది పార్టీ .. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా బిజెపిని దెబ్బకొట్టాలని ఇప్పటి నుండి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేస్తూ ఉండగా ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ ని రంగంలోకి చంపటానికి కాంగ్రెస్ హైకమాండ్ రెడీ అయింది.

Security breach at Priyanka Gandhi home after losing SPG cover; family of 5  drives in, asks for photo - The Statesman

ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చే హామీలు కచ్చితంగా.. కాంగ్రెస్ నెరవేరుస్తుంది అని ప్రజలలో భరోసా నిలపడానికి ప్రతిజ్ఞ యాత్ర పేరిట.. ప్రియాంక గాంధీ.. యూపీలో జలను పలకరించటానికి రెడీ అవుతున్నట్లు ఇప్పటికే టాక్ నడుస్తూ ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న సర్వేలలో బిజెపి పార్టీ కొద్దిగా బలహీన పడినట్లే.. అన్న రీతిలో ఫలితాలు వస్తూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. విషయంలోకి వెళితే కాంగ్రెస్ పార్టీ యుపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ని రంగంలోకి దింపాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ప్రియాంక గాంధీ అయితే ప్రజలలో మరింతగా పార్టీపై నమ్మకం పెరుగుతుందని ఆ దిశగా ఆలోచిస్తూ కాంగ్రెస్ హైకమాండ్.. వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో.. ప్రియాంక గాంధీని యూపీ సీఎం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడానికి అండర్ గ్రౌండ్ లో డిస్కషన్లు చేసినట్లు త్వరలో ప్రకటించనున్నట్లు యూపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా బిజెపిని దెబ్బకొట్టాలని ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాక సమాజ్వాది అదే రీతిలో బీఎస్పీ పార్టీలు.. ఎవరికివారు వ్యూహాలు వేసుకుంటున్నారు.


Share

Related posts

పాల్‌పై కేసు నమోదు

somaraju sharma

తమిళనాడులో కొత్త పార్టీ..!? వెనుక బీజేపీ ఉన్నట్టా..? లేనట్టా..!?

Muraliak

మరో ఐదు రోజులే మిగిలింది

sarath