Priyankagandhi Padayatra: దేశంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం కోసం.. ప్రియాంక గాంధీ మైండ్ బ్లోయింగ్ డెసిషన్..!!

Share

Priyankagandhi Padayatra: పాదయాత్ర ఫార్మలా చాలావరకు రాజకీయ నాయకుల కెరీర్ లలో వర్కౌట్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి దేశంలోనే మొట్టమొదటి సారిగా పాదయాత్ర చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేని టైం లో రైతుల కష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టి అనేక హామీలు ఇచ్చి ఆ సమయంలో టిడిపిని చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయ్యారు వైయస్సార్. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కూడా గెలవడం జరిగింది. అనంతరం ప్రతిపక్ష పార్టీకి పరిమితమైన చంద్రబాబు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ విభజన జరగక ముందు మీ కోసం పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకున్నారు.

Priyanka Gandhi Vadra to Set up Base Camp in Lucknow, Conduct Brainstorming Session For 2022 UP polls | India.com

ఈ క్రమంలో వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా 2014 ఎన్నికల్లో ఎన్ని కావటంతో సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప పాదయాత్ర స్టార్ట్ చేసి.. 2019 ఎన్నికలలో రికార్డు స్థాయిలో విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఇదే మాదిరిగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా మొనగాడ లేని తరుణం లో వచ్చే ఏడాది దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో.. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రియాంక గాంధీ పాదయాత్ర చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

12 వేల కిలోమీటర్లు ప్రతిజ్ఞ యాత్ర…

దాదాపు 12 వేల కిలోమీటర్లు ప్రతిజ్ఞ యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తారు.. అని యూపీ ప్రజలలో నమ్మకం కలిగించడానికి.. ప్రియాంక గాంధీ యాత్ర చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి వ్యతిరేకంగా సర్వే ఫలితాలు వస్తూ ఉండటంతో ఇదే అసలు సిసలైన టైం అని.. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రియాంక గాంధీ తాత యూపీ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. సైకిల్ యాత్ర చేపడుతున్నారు. మరోపక్క బీఎస్పీ కూడా అనేక కార్యక్రమాలు ప్లాన్ చేస్తుంది. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ.. యూపీ లోపల పడే రీతిలో ప్రియాంక గాంధీ చేత యాత్ర చేయించడానికి రెడీ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

కేంద్రంలో బీజేపీ పై తీవ్ర వ్యతిరేకత….

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిజెపి పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఉత్తర భారత దేశంలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో.. చాలా వరకు బిజెపికి వ్యతిరేకంగా సర్వే ఫలితాలు వస్తున్నాయి. కరోనా కట్టడి చేయడంలో ఫెయిల్ అవ్వటం తో పాటు.. పెట్రోల్ డీజిల్ ధరలు విషయంలో నియంత్రణ లేకపోవడంతో.. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేయటంతో కేంద్రంలో బీజేపీ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇదే సరైన సమయం అని బీజేపీ ని ఎలాగైనా దెబ్బకొట్టాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని.. ప్రియాంక గాంధీ చేత యాత్ర చేయించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


Share

Related posts

TMC Leader Mukul Roy: జడ్ కేటగిరి భద్రత ఉపసంహరించాలంటూ కేంద్రానికి లేఖ రాసిన టీఎంసీ నేత..!!

somaraju sharma

Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కూడా స్వీట్స్ తినవచ్చు..!! ఇలా తినాలి..!!

bharani jella

Today Horoscope అక్టోబర్ 13th మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha