NewsOrbit
జాతీయం న్యూస్

Puducherry: 40 ఏళ్ల తరువాత ఆ రాష్ట్రంలో మహిళా నేతకు మంత్రి పదవి..! సీఎం రంగస్వామికి హాట్సాఫ్ చెబుతున్న మహిళాలోకం..!!

Puducherry: జనాభాలో సగ భాగం ఉన్న మహిళలు అనేక రంగాల్లో తమ ప్రతిభతో ముందుకు సాగుతున్నారు. రాజకీయ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. అయితే రాజకీయ రంగంలో పదవుల విషయంలో ఇంకా వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుఛ్చేరి అసెంబ్లీలో నాలుగు దశాబ్దాలుగా మహిళా నేతలకు మంత్రి వర్గంలో చోటు లభించలేదు. 40 ఏళ్ల తరువాత ఓ మహిళా నేత మంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టారు.  పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి బీజెపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్న వేళ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి వర్గ జాబితాను ఎల్‌టీ గవర్నర్  తమిళి సై సౌందర్యరాజన్ అందజేశారు. ఈ మంత్రి వర్గ జాబితాకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.

Puducherry cabinet woman minister
Puducherry cabinet woman minister

ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రుల మాదిరిగా కాకుండా రంగస్వామి తన కేబినెట్ లోకి మహిళా నేతను తీసుకున్నారు. కారైక్కాల్ ప్రాంతంలోని నెడుంగాడు రిజర్వుడ్ స్థానం నుండి విజయం సాధించిన ఎన్ఆర్ కాంగ్రెస్ మహిళా నేత చందిరా ప్రియాంగ మంత్రిగా అవకాశం కల్పించారు. ఆదివారం పుదుఛ్చేరి రాజ్ భవన్ లో మంత్రులతో ఎల్‌టీ గవర్నర్ తమిళి సై ప్రమాణ స్వకారం చేయించారు. కోవిడ్ నేపథ్యంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని పరిమిత సంఖ్యలో అతిధుల మధ్యనే నిర్వహించారు.

Puducherry cabinet woman minister
Puducherry cabinet woman minister

Read More: Revanth Reddy Effect: టీపీసీసీలో ప్రకంపనలు స్టార్ట్..! ఎంపి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

1980 -83 లో కాంగ్రెస్, డీఎంకే కూటమి మంత్రి వర్గంలో డీఎంకే కు చెందిన రేణుక అప్పాదురై మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత నుండి ఇప్పటి వరకూ రాష్ట్రంలో మహిళా నేతలకు మంత్రి పదవులు వరించలేదు. మహిళా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ లు వచ్చినా ముఖ్యమంత్రులు అవకాశం కల్పించలేదు. నాలుగు దశాబ్దాల తరువాత రంగస్వామి మంత్రివర్గంలో మహిళా నేతకు మంత్రి పదవి వరించడంతో ఆ ప్రాంతంలోని మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రంగస్వామికి మహిళాలోకం హాట్సాఫ్ చెబుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N