Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో తాజాగా మరో అరెస్టు జరిగింది. ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తులను అరెస్టు చేయగా, తాజాగా పంజాబ్ కు చెందిన బ్రిండ్ కో సేల్స్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రాను ఈడీ ఇవేళ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ లో గౌతమ్ మల్హోత్రా ప్రమేయంపై ఓ స్పష్టత రావడంతో ఈడీ అరెస్టు చేసింది.

గౌతమ్ మల్హోత్రా పంజాబ్ శిరోమణి అకాళీదళ్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే దీపక్ మల్హోత్రా కుమారుడు. మద్యం తయారీ వ్యవహారాల్లో నిమగ్నమైన ఓయాసిస్ గ్రూపు వ్యవహారాలను సైతం గౌతమ్ దగ్గర ఉండి చూసుకుంటుంటారు. గౌతమ్ వైన్స్ పేరుతోనే ఓయాసిస్ గ్రూపు మార్కెట్ లోకి మద్యం తీసుకొస్తొంది. మద్యం కుంభకోణంలో గ్రూపులుగా ఏర్పడటంలో గౌతమ్ మల్హోత్రా కీలక పాత్ర పోషించినట్లుగా ఈడీ అనుమానిస్తున్నది. అక్రమ నగదు బదిలీ, నేరాల్లో నిందితుడుగా ఉన్న గౌతమ్ మల్హోత్రా .. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విదానాన్ని అక్రమంగా పొందినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇక ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సైతం సీబీఐ అరెస్టు చేసింది. డిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందనీ.. హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు లబ్దిచేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను నిన్న రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేసారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ప్రముఖ వ్యక్తి అరెస్టు