NewsOrbit
జాతీయం న్యూస్

Punjab: స్వర్ణదేవాలయం సమీపంలో భారీ పేలుడు .. ఐదుగురు అరెస్టు

Punjab five arrested in Amritsar blast

Punjab:అమృత్ సర్ స్వర్ణ దేవాలయం (గురు రామ్ దాస్ నివాస్) సమీపంలో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి అయిదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్లు జరగడం వారం రోజుల్లో ఇది మూడో సారి. గత అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు పేలుడు సంభవించినట్లుగా తెలుస్తొంది. పేలుడు ఘటనకు సంబంధించి అయిదుగురిని అరెస్టు చేసి కేసును ఛేదించినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను విఘాతం కల్గించడమే ఈ పేలుడుల వెనుక ఉద్దేశమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Punjab five arrested in Amritsar blast
Punjab five arrested in Amritsar blast

 

తాజా పేలుడు సమయంలో అక్కడ సమీపంలోని ఓ గదిలో ఉన్న ఇద్దరు పురుషులు, ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేలుడు కోసం పొటాషియం క్లోరేట్ ను ఉపయోగించినట్లుగా పోలీసులు తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ నౌనిహాల్ సింగ్ తెలిపారు.  ఈ నెల 6, 8న కూడా స్వర్ణ దేవాలయం వీధిలో పేలుళ్లు సంభవించాయి. వరుస పేలుళ్లతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుళ్లప విచారణ కోసం పంజాబ్ పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సాయం తీసుకున్నాయి.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల రెండో సారి జరిగిన పేలుడు ప్రాంతాన్ని సందర్శించింది. తాజా ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ బృందం అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. తొలి పేలుడు సమయంలో ఓ వ్యక్తి గాయపడగా, సమీప భవనాల్లోని అద్దాలు పగిలిపోయాయి. మే 8న సంభవించిన రెండో పేలుడు తీవ్రత కొంత తక్కువే అయినా మరో వ్యక్తి గాయపడ్డాడు. పేలుళ్లకు ఉపయోగించిన ట్రిగ్ర్ కానీ, ఎలాంటి పరికరం గానీ ఆ ప్రాంతంలో పోలీసులకు ఇప్పటి వరకూ లభ్యం కాలేదు. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ..కుమార స్వామి సీఎంగా హ్యాట్రిక్ కొడతారా..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju