NewsOrbit
జాతీయం న్యూస్

రాహుల్ గాంధీ “భారత్ జోడో” యాత్ర డేట్ ఫిక్స్.. ఎప్పటి నుండి..? ఎన్ని రోజులు అంటే..?

దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా కేంద్రంలో బీజేపీ రెండు సార్లు అధికారంలోకి రావడం, బీజేపీ వ్యహాలు, ఎత్తుగడలతో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పలు రాష్ట్రాల్లో అధికారం చేరువలోకి వచ్చినా బీజేపీ వ్యూహాలతో చేజార్చుకుంటోంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ఇటీవల ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో భాగంగా భారత్ జోడో యాత్రను దేశ వ్యాప్త ఉద్యమంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భాగంగా గురువారం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ పదాధికారుల సమావేశంలో భారత్ జోడో యాత్ర విధి విధానాలపై నేతలు చర్చించారు. అనంతరం భారత్ జోడో యాత్ర వివరాలను సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ లు మీడియాకు వివరించారు.

 

రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ 2న ప్రారంభం అవుతుందని దిగ్విజయ్ సింగ్, జై రామ్ రమేష్ లు తెలిపారు. ఈ యాత్ర 148 రోజుల పాటు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 3500 కిలో మీటర్ల మేర జరుగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి రోజు 25 కిలో మీటర్ల పాదయాత్ర కొినసాగుతుందని చెప్పారు. ఈ యాత్రలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగుతుందని తెలిపారు.

గత ఎనిమిది సంవత్సరాల బీజేపీ పరిపాలనలోని వైఫల్యాలు, ప్రజాస్వామ్యంపై దాడి, రాజ్యాంగ సంస్థలను వ్యక్తులపై ఉసి గొల్పడం, అధిక ధరలు, నిరుద్యోగం, రైతు సమస్యలు ప్రధాన ఎజెండాగా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. అయితే రాష్ట్రాల పీసీసీల సన్నద్దత తర్వాత యాత్ర ఎక్కడ నుండి ప్రారంభం అవుతుందనే దానిపై ప్రకటన చేస్తామని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్కడి పీసీసీల రాష్ట్ర నాయకులు చేపట్టిన యాత్రలు కూడా ఇందులోకి చేరుతాయని పేర్కొన్నారు.

మాల్దీవుల నుండి పేకాఫ్ .. సింగపూర్ మీదుగా సౌదీకి గొటబాయ

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?