పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ ను దోషిగా తెల్చింది సురత్ కోర్టు. ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం ఉద్దేశ పూర్వకంగా అవమానించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని సూరత్ కోర్టు న్యాయమూర్తి హెచ్ఎచ్ వర్మ స్పష్టం చేశారు. ఆ నేరానికి గానూ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే శిక్ష అమలునకు 30 రోజులు సస్పెండ్ చేస్తూ, రాహుల్ కి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు కల్గించి.

2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటక కోలార్ లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ .. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వివిధ ఆర్ధిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్ మోడీ, నీరవ్ మోడీల పేర్లను ప్రస్తావిస్తూ దేశంలో దొంగల ఇంటి పేరు మోడీ అనే ఎందుకు ఉంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై ఆనాడే తీవ్ర దుమారం చెలరేగింది. తమ సామాజిక వర్గాన్ని అవమానించేలా రాహుల్ మాట్లాడారంటూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ రాహుల్ పై పరువునష్టం వాదా వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి .. గత వారం విచారణను ముగించారు. తీర్పును మార్చి 23కు వాయిదా వేస్తున్నట్లు ఆనాడు ప్రకటించారు. నేడు (గురువారం) పరువునష్టం కేసులో తుది తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు హజరైయ్యారు.
ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ .. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వైఎస్ జగన్