NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ గాంధీకి బిగ్ షాక్ .. అనర్హత వేటు వేసిన లోక్ సభ సెక్రటేరియట్

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది. నిన్న గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కాదని ప్రకటించింది. లోక్ సభ ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు, ఆ పైన శిక్ష పడితే అనర్హత వేటు వేసే అవకాశముంది. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటలోపే లోక్ సభ సెక్రటేరియట్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. కర్ణాటకలో 2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ పై దాఖలైన పరువు నష్టం వ్యాజ్యంలో సూరత్ కోర్టు నిన్న రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టుకు వెళ్లేందుకు 30 రోజులు గడువు ఇచ్చింది. రాహుల్ గాంధీ కి శిక్ష పడిన 24 గంటల వ్యవధిలోనే లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

Rahul Gandhi

లోక్ సభ సెక్రటేరియట్ సర్కూలర్ ఇలా

కేరళలోని వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని సూరత్ కోర్టు ఆఫ్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ దోషిగా తేల్చడంతో లోక్ సభ సభ్యత్వం నుండి అనర్హత వేటు పడింది. దోషిగా తేలిన 23 మార్చి 2023 నుండి అనర్హత వర్తిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య చట్టం 1951 సెక్షన్ 8 లోని ఆర్టికల్ 102 (1)(e) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం అని లోక్ సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్సల్ కుమార్ సింగ్ సర్క్యులర్ లో పేర్కొన్నారు.

సూరత్ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కోర్టు తీర్పుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. బీజేపీ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామని పేర్కొన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని ఖర్గే విమర్శించారు. దీనిపై రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ స్పందించారు. తన సోదరుడు భయపడే రకం కాదనీ, భయపడబోడని చెప్పారు. నిజం చెప్పడమే అలాటనీ, నిజమే చెబుతామన్నారు. రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

కాగా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు అందరూ ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. జాతీయ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో పార్టీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల నుండి కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు .. నివాసం వద్ద టెన్షన్ టెన్షన్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju