NewsOrbit
జాతీయం న్యూస్

Rahul Gandhi: ఆ విషయంలో మెత్తబడిన రాహుల్ గాంధీ..!!

Rahul Gandhi: గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో రాహుల్ గాంధీ నైతిక బాధ్యత వహించి అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. పార్టీ సీనియర్ నేతలు రాహుల్ ను కొసాగాలని ఎంత ఒత్తిడి చేసినా ససేమిరా అన్నారు. దీంతో సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. శనివారం జరిగిన సీడబ్ల్యుసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ మరో సారి బాధ్యతలు చేపట్టాలన్న డిమాండ్ బలంగా వ్యక్తం అయ్యింది. ఏఐసీసీ సీనియర్ నాయకులు సైతం రాహుల్ నాయకత్వానికి మద్దతు పలికారు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పేరును అశోక్ గెహ్లాట్ ప్రతిపాదించగా ఇతర నేతలు సానుకూలంగా స్పందించారు. అధ్యక్ష బాధ్యతల విషయంలో ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ..సీడబ్ల్యుసీ మీటింగ్ నేతల ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను మరో సారి చేపట్టే అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాననీ అయితే పార్టీ సైద్ధాంతిక భావజాలంపై సీనియర్ల నుండి స్పష్టత రావాల్సి ఉందనీ, నేతలు తమ నిర్ణయాలను వెల్లడించాలని తెలిపినట్లు సమాచారం.

Rahul Gandhi says he will consider party top post
Rahul Gandhi says he will consider party top post

Rahul Gandhi: ఏఐసీసీ సంస్థాగత ఎన్నికల షెడ్యుల్ కు సీడబ్ల్యుసీ ఆమోదం

ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే వరకూ రాహుల్..కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగాలని పలువురు సీనియర్ లు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అధ్యక్షోపన్యాసంలో సోనియా గాంధీ పార్టీకి తానే పూర్తి స్థాయి అధ్యక్షురాలిననీ, తాత్కాలిక అధ్యక్షురాలిగా చూడవద్దని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా సీడబ్ల్యుసీ సమావేశం అనంతరం వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ వెల్లడించారు. ఏఐసీసీ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికలు 2022 ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 20 20 మధ్య జరుగుతుందని వెల్లడించారు. సంస్థాగత ఎన్నికల షెడ్యుల్ కు సిడబ్ల్యుసీ ఆమోదం తెలిపింది. నవంబర్ 1వ తేదీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. 2022 ఏప్రిల్ లో అధ్య పదవికి నామినేషన్లు స్వీరించనున్నారు.

2022 అక్టోబర్ 21 కొత్త అధ్యక్షుడి ఎన్నిక

2022 ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 21 వరకూ సీడబ్ల్యుసీ సభ్యుల ఎన్నిక జరుగుతుంది, 2022 అక్టోబర్ 21 నాటికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. పార్టీల కింది స్థాయి నుండి పై స్థాయి వరకూ భారీ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై కార్యకర్తలు, నేతలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో రైతులపై జరుగుతున్న దాడులు, వ్యవసాయ రంగం దుస్థితి, రాజకీయ పరిస్థితులకు వ్యతిరేకంగా తీర్మానాలను సిడబ్ల్యూసీ ఆమోదించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju