NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: రాహుల్ న‌మ్మిన‌బంటును చేర్చుకోవ‌డం వెనుక మోడీ భ‌లే గేమ్ ప్లాన్‌

Rahul Gandhi: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మ‌రోమారు త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద ఆ పార్టీకి గుడ్ బై చెప్పి క‌మలం గూటికి చేరడం దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌లేపుతూ మోడీ ఈ గేమ్ ప్లే చేశార‌ని అంటున్నారు.

Read More: Modi: మోడీ కి పెద్ద రిలీఫ్‌… క‌రోనా సెకండ్ వేవ్ క‌ష్టాలు తేలేద‌ట‌

10 శాతం ఉన్న వాళ్లే టార్గెట్ …

యూపీలోని దౌరాహ్రా నియోజకవర్గానికి చెందిన జితిన్‌ ప్రసాద బ్రాహ్మణ సామాజిక‌వ‌ర్గాని చెందిన వారు. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 10 శాతం ఉన్న బ్రాహ్మణులు 90వ దశకం ప్రారంభం నుండి బీజేపీకి మద్దతుదారులుగా ఉన్నారు. అయితే రాజ్‌పుత్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన యోగి ఆధిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గతేడాది గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌తో తమకు వ్యక్తిగత సానుభూతి లేదని ప్రకటించినప్పటికీ.. పరిస్థితి వ్యతిరేకంగానే ఉంది. పార్టీలో కొందరు నేతలు అసంతృప్తి ప్రకటించినప్పటికీ.. వచ్చే ఏడాది కూడా యోగికే అధికారం కట్టబెట్టనున్నట్లు బీజేపీ అధిష్టానం స్పష్టం చేయడం గమనార్హం. ఇదే స‌మ‌యంలో ప్రతిపక్షాలు బ్రాహ్మణుల వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

Read More: Modi: మోడీ కి పెద్ద రిలీఫ్‌… క‌రోనా సెకండ్ వేవ్ క‌ష్టాలు తేలేద‌ట‌

లెక్క త‌ప్ప‌కుండా…

పార్టీని ప్రక్షాళన చేయాలంటూ గళమెత్తిన 23 మంది అసమ్మతి కాంగ్రెస్‌ నేతల్లో జితిన్‌ కూడా ఒకరు. గతంలో రాహుల్‌కు మరో అత్యంత సన్నిహితుడు జ్యోతిరాథిత్య సింథియా కూడా పార్టీని వీడినప్పుడు.. జితిన్‌ కూడా బిజెపిలోకి వెళ్లిపోతారన్న వార్తలు రాగా… ఆయన స్వయంగా ఖండించారు. అయితే ఆయనను అప్పుడు కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ అడ్డుకున్నారని తెలుస్తోంది. బ్రాహ్మణ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కల్‌రాజ్‌ మిశ్రాను అంతగా ప్రభావం చూపడం లేదని బీజేపీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారు. దీంతో జితిన్‌ ప్రసాద్‌ రాకతో తిరిగి బ్రాహ్మణుల మద్దతు కూడగట్టుకోవచ్చని బీజేపీ ఆశిస్తోంది.

author avatar
sridhar

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju